Telugu Global
CRIME

భార్యకు భయపడి పాస్‌పోర్ట్ పేజీలు చించాడు.. చివరికి జైలు పాలయ్యాడు.. అసలు స్టోరీ ఏంటి?

ముంబైలోని ఒక కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్యకు భయపడి చేసిన పని.. చివరకు జైలు పాలయ్యేలా చేసింది. వివరాలకు వెళితే.. ఓ యువకుడు (32) ముంబై‌లోని కంపెనీలో పని చేస్తున్నాడు. అతడికి పెళ్లై భార్య కూడా ఉన్నది. సాఫీగా సాగిపోతున్న సంసారమే అయినా.. అతడికి ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. అది కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. అడపాదడపా బ‌య‌ట‌ కలుసుకోవడం.. ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప.. ఎక్కువ సమయం గడపడానికి సమయం లేకుండా […]

భార్యకు భయపడి పాస్‌పోర్ట్ పేజీలు చించాడు.. చివరికి జైలు పాలయ్యాడు.. అసలు స్టోరీ ఏంటి?
X

ముంబైలోని ఒక కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్యకు భయపడి చేసిన పని.. చివరకు జైలు పాలయ్యేలా చేసింది. వివరాలకు వెళితే.. ఓ యువకుడు (32) ముంబై‌లోని కంపెనీలో పని చేస్తున్నాడు. అతడికి పెళ్లై భార్య కూడా ఉన్నది. సాఫీగా సాగిపోతున్న సంసారమే అయినా.. అతడికి ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. అది కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. అడపాదడపా బ‌య‌ట‌ కలుసుకోవడం.. ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప.. ఎక్కువ సమయం గడపడానికి సమయం లేకుండా పోయింది. దీంతో అతను ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు.

ఆఫీసు పని మీద టూర్ వెళ్తున్నానని చెప్పి ప్రియురాలితో కలిసి మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేశాడు. ఆ టూర్ సక్సెస్ కావడంతో మరో టూర్ ప్లాన్ చేశాడు. అప్పడప్పుడు విదేశాలకు టూర్లకు వెళ్లడం కామనే కాబట్టి భార్యకు కూడా అనుమానం రాలేదు. రెండో సారి ప్రియురాలిని వెంటబెట్టుకొని మళ్లీ మాల్దీవులకు వెళ్లాడు. ఈ సారి అనుకున్న దానికన్నా కొన్ని రోజులు ఎక్కువే గడిపాడు. దాంతో భార్య ఇండియా నుంచి కాల్స్ చేయడం మొదలు పెట్టింది. వీడియో కాల్స్ చేస్తుండటంతో అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. రోజు రోజుకూ భార్య కాల్స్ ఎక్కువవుతుండటంతో అతడు, ప్రియురాలితో కలసి ఇండియాకు తిరుగు ప్రయాణం అయ్యాడు.

అయితే అక్కడే అతను తెలివితక్కువ పని చేశాడు. భార్య తన పాస్‌పోర్ట్ పరిశీలిస్తుందేమో అనే అనుమానంతో మాల్దీవుల వీసా స్టాంపింగ్ ఉన్న పేజీలు చించేశాడు. ప్రియురాలితో కలసి ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి పాస్‌పోర్టులో కొన్ని పేజీలు మిస్ అయినట్లు గుర్తించారు. గురువారం రాత్రి అతడు ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు పరిశీలించగా 3 నుంచి 6, 31 నుంచి 34 నెంబర్ పేజీలు చించినట్లు అధికారులు గుర్తించారు.

అయితే పేజీలు ఎందుకు చించావని సదరు వ్యక్తిని ప్రశ్నించగా.. అధికారులకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సహర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో అతడు అసలు విషయం చెప్పాడు.

భార్యకు భయపడి ఆ పేజీలు తానే చించానని, ప్రియురాలితో వెళ్లిన విషయం బయటపడుతుందనే భయంతోనే పాస్‌పోర్టును డ్యామేజ్ చేశానని ఒప్పుకున్నాడు. పాస్‌పోర్టులో పేజీలు చించడం నేరమని తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. పాస్‌పోర్టును భారత ప్రభుత్వం జారీ చేస్తుందని, దాన్ని ఉద్దేశపూర్వకంగా డ్యామేజ్ చేయడం తీవ్రమైన నేరమని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పాస్‌పోర్ట్ డ్యామేజ్ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రియురాలితో ఎంజాయ్‌మెంట్ చేసిన ఆనందం కాస్తా.. ఇలా ఆవిరైపోయింది.

First Published:  10 July 2022 8:02 AM IST
Next Story