Telugu Global
NEWS

ప్ర‌జ‌ల‌కు చెప్ప‌ద‌లచుకుంది ఇదేనా..?

జనం మెరిశారు.. జగన్ మురిశారు..! జనం జేజేలు పలికారు.. జగన్ చేయూతగా నిలిచారు..! జనమే జగనని.. జగనే జనమని మరోసారి నిరూపించారు..! వైసీపీ ప్లీనరీ వేడుక, వేదిక అన్నీ వైసీపీ భావి లక్ష్యాన్ని గుర్తు చేశాసాయి, భరోసాని చాటాయి.. ఈ రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో మొదటి రోజే లక్షకు పైగా జనం అనుకుంటే.. రెండో రోజు దాదాపు 6 లక్షలకు పైగా శ్రేణులు, జనం తరలిరావడంతో ప్రాంగణం మొత్తం జగన్నామస్మరణతో.. జగన్ జేజేలతో మార్మోగిపోయింది..! జగన్ […]

ప్ర‌జ‌ల‌కు చెప్ప‌ద‌లచుకుంది ఇదేనా..?
X

జనం మెరిశారు.. జగన్ మురిశారు..! జనం జేజేలు పలికారు.. జగన్ చేయూతగా నిలిచారు..! జనమే జగనని.. జగనే జనమని మరోసారి నిరూపించారు..! వైసీపీ ప్లీనరీ వేడుక, వేదిక అన్నీ వైసీపీ భావి లక్ష్యాన్ని గుర్తు చేశాసాయి, భరోసాని చాటాయి.. ఈ రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో మొదటి రోజే లక్షకు పైగా జనం అనుకుంటే.. రెండో రోజు దాదాపు 6 లక్షలకు పైగా శ్రేణులు, జనం తరలిరావడంతో ప్రాంగణం మొత్తం జగన్నామస్మరణతో.. జగన్ జేజేలతో మార్మోగిపోయింది..!

జగన్ ఏమి చెబుతారు..? నాయకులకు ఎటువంటి దిశా నిర్దేశం చేస్తారు..? కార్యకర్తలకు ఎలా భరోసా ఇస్తారు..? రాష్ట్ర ప్రజలకు ఏమి సందేశం ఇస్తారు..? ఈ సందేహాలు అన్నింటికీ వైసీపీ ప్లీనరీ ద్వారా సమాధానం దొరికింది. గతంలో జరిగిన ప్లీనరీలకు భిన్నంగా అయిదేళ్ల క్రితం 2017లో నాడు ప్రతిపక్ష హోదాలో నిర్వహించిన ప్లీనరీకి భిన్నంగా ఈ రోజు వైసీపీ ప్లీనరీ ముగిసింది. అందరూ ఊహించినట్లే జగన్ సహా ముఖ్యనేతలు అందరూ కూడా వ్యూహాత్మకంగానే మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వాటి ఫలాలు వివరిస్తూనే వాటిని ప్రజల్లోకి చెడుగా తీసుకువెళుతున్న ప్రతిపక్ష మీడియాలను చండాడారు. ఓవరాల్ గా వైసీపీ ప్లీనరీతో పార్టీకి, కార్యకర్తలకు ఒక స్పష్టమైన సంకేతాలు అయితే వచ్చాయి.

ప్రతిఫలం పోరాటం – అదే అజెండా..!

వైసీపీ రాబోయే ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే సిద్ధం అవుతున్నారు. రెండే అజెండాలు. 1.తన పరిపాలనలో చేస్తున్న మంచిని ప్రజలకు వివరించడం. 2.ప్రతిపక్ష అనుకూల మీడియా సహా ప్రతిపక్షాలు చెబుతున్న చెడులో మంచిని కూడా ప్రజలకు చెప్పడం. ఇవే జగన్ ప్రధాన ఉద్దేశాలు. సంక్షేమ పథకాలు ఇన్ని లక్షల కోట్లు అమలు చేయడం సాధారణ విషయం ఏమీ కాదు.

దాన్ని జగన్ చేసి చూపిస్తున్నారు. ఎక్కడా ప్రకటించిన తేదీ, గడువు ఏ మాత్రం మించకుండా డబ్బులు వేయగలుగుతున్నారు. ఇది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వమూ ఈ విధంగా చేయలేదు. ఆ విషయాన్ని ప్రజలకు సూటిగా స్పష్టంగా లోతుగా తీసుకువెళ్లడమే వైసీపీ ముందు ఉన్న ప్రధాన లక్ష్యం. సో.. రాబోయే రెండేళ్లు లేదా రాబోయే ఏడాది జగన్ దీనిపై దృష్టి పెడతారు. జనానికి ఇదే వివరిస్తారు. ఇదే సందర్భంలో కోడి గుడ్డుపై ఈకలు పీకుతున్న చందంగా ప్రతిపక్ష అనుకూల మీడియాలు రాస్తున్న అడ్డగోలు రాతలు వాటి వెనుక ఉన్న నిజాలు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలి. అందుకే ఈ రోజు వైసీపీ ప్లీనరీలో జగన్ సహా ముఖ్య నేతలు అందరూ కూడా దుష్టచతుష్టయంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎల్లో మీడియాపై బాణం ఎక్కుపెట్టారు.

పక్కా ప్రణాళికతో సీఎం జగన్..!?

ప్లీనరీ ముగిసింది. ఇక పోరే మిగిలి ఉంది. సీఎం జగన్ కూడా అందుకు తగ్గ ప్రణాళికలు వేసుకుంటున్నారు. 2017లో వైసీపీ ప్లీనరీ ముగిసిన తరువాత సీఎం జగన్ మహాపాదయాత్ర చేశారు. జనంలోకి వెళ్లారు. తనను సీఎం చేస్తే ఏమి ఇస్తారో, ఎలా పరిపాలిస్తారో వివరించారు. నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజల మెప్పు పొందగలిగారు. అప్పుడు పరిస్థితులు వేరు. ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు. పాదయాత్ర చేయడానికి సమయం ఉండదు. కానీ ప్రజలను మెప్పించాలి. మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి.

అదే జగన్ ముందు ఉన్న లక్ష్యం. సో.. దానికి తగ్గట్టే ప్రణాళికలు ఉన్నట్లు తెలుస్తొంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి వారానికి ఒక జిల్లాలో పర్యటించి ఆ జిల్లాలో రెండు రోజుల పాటు బస చేసి అధికారిక సమీక్షలతో పాటు సచివాలయ సందర్శనతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లాలోని నాయకులతో సమీక్షా సమావేశాలు జరపాలి అనేది సీఎం జగన్ ప్రణాళిక అన్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రతి 26 జిల్లాలో కూడా సీఎం జగన్ రెండేసి రోజులు పర్యటించడం ద్వారా ఓ వైపు పాలన, మరో వైపు పార్టీ వ్యవహారాలు రెండు చక్క బెట్టుకోవచ్చు అనేది ఆలోచన.

ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్న అపవాదు ఉంది. పనిలో పనిగా జిల్లాల పర్యటనల ద్వారా ఎమ్మెల్యేలతో కూడా ముఖాముఖి కాసేపు మాట్లాడితే ఆ అసంతృప్తి, అసమ్మతి పోగొట్టుకోవచ్చు అనే ఆలోచన కూడా ఉందట. సో.. పార్టీ ప్రణాళికలు , జగన్ ప్రణాళికలు బేషూగ్గానే కనిపిస్తున్నాయి.

First Published:  10 July 2022 3:04 AM IST
Next Story