Telugu Global
National

దోమలకు కృత్రిమ ఆహారం.. పేటెంట్ కి ఐసీఎంఆర్ దరఖాస్తు

దోమ కుట్టిన వెంటనే చటుక్కున కొట్టి చంపేస్తాం. దోమల బ్యాట్ లు, ఆలౌట్ లు.. అనేక రకాలుగా వాటిని మట్టుబెడుతుంటాం. కానీ దోమలను అతి జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతుంటారు కొంతమంది. అవును, దోమలపై ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు వాటిని అపురూపంగా చూసుకుంటారు. వాటిని పెంచి పోషించేది కూడా వాళ్లే. గుడ్లుపెట్టి, పొదిగేందుకు అవసరమైన కృత్రిమ వాతావరణాన్ని సృష్టిస్తుంటారు. ఇప్పటి వరకూ దోమలకు ఆహారంగా రక్తాన్ని అందించడానికి శాస్త్రవేత్తలు బ్లాడ్ బ్యాంకుల్ని ఆశ్రయించేవారు. లేదా పశువులనుంచి దోమలు […]

దోమలకు కృత్రిమ ఆహారం.. పేటెంట్ కి ఐసీఎంఆర్ దరఖాస్తు
X

దోమ కుట్టిన వెంటనే చటుక్కున కొట్టి చంపేస్తాం. దోమల బ్యాట్ లు, ఆలౌట్ లు.. అనేక రకాలుగా వాటిని మట్టుబెడుతుంటాం. కానీ దోమలను అతి జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతుంటారు కొంతమంది. అవును, దోమలపై ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు వాటిని అపురూపంగా చూసుకుంటారు. వాటిని పెంచి పోషించేది కూడా వాళ్లే. గుడ్లుపెట్టి, పొదిగేందుకు అవసరమైన కృత్రిమ వాతావరణాన్ని సృష్టిస్తుంటారు.

ఇప్పటి వరకూ దోమలకు ఆహారంగా రక్తాన్ని అందించడానికి శాస్త్రవేత్తలు బ్లాడ్ బ్యాంకుల్ని ఆశ్రయించేవారు. లేదా పశువులనుంచి దోమలు రక్తం పీల్చే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ భారతీయ శాస్త్రవేత్తలు కృత్రిమంగా వాటికి ఆహారం అందించే పరికరాలను కనుగొన్నారు. రెండు నూతన ఉత్పాదనలకు ఐసీఎంఆర్ కు చెందిన ‘వెక్టార్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్’ (VCRC) శాస్త్రవేత్తలు పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. వీటిపై పేటెంట్ లభిస్తే దోమలపై పరిశోధనలు కొత్త మలుపు తిరిగినట్టే.

ఇటీవల ఇండియన్ పేటెంట్ ఆఫీస్ కి దరఖాస్తు పంపించామని, అయితే అంతర్జాతీయ స్థాయిలో దీనికి పేటెంట్ కోరుతున్నట్టు తెలిపారు VCRC డైరెక్టర్ డాక్టర్ అశ్విని కుమార్. ల్యాబొరేటరీల్లో దోమలపై ప్రయోగాలు చేసేందుకు ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్న ఉత్పాదనలు అని తెలిపారాయన. బేబీ ఫార్ములా ఫుడ్ ఆధారంగా దోమలకు అందించే ఆహారాన్ని తయారు చేస్తున్నట్టు తెలిపారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న డాక్టర్ నిషా మాథ్యూ.

రెండు ఉత్పాదనల్లో ఒకటి.. దోమలకు ఆకలి ఎక్కువయ్యేలా చేస్తుంది, మరొకటి ఆ సమయానికి దాని ఆకలి తీర్చే కృత్రిమ ఆహారం. ఆడ దోమలు రక్తానికి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన ఈ ఆహారాన్ని తీసుకుని గుడ్లు పెడతాయి, ఆ తర్వాత వాటిని పొదుగుతాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా దోమలకోసం ఇలా కృత్రిమ ఆహారాన్ని అందించే పద్ధతిని భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించారు. స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నాలజీ, పాపులేషన్ రిడక్షన్ స్టడీలో ఇది ఓ పెద్ద ముందడుగు అని చెబుతున్నారు.

First Published:  10 July 2022 7:22 AM IST
Next Story