ఐటెంసాంగ్ స్పెషల్ అంటున్న అంజలి
మినిమం గ్యాప్స్ లో ఐటెంసాంగ్స్ చేయడంలో మజా ఉంటుందని చెబుతోంది అంజలి. హీరోయిన్లంతా ఐటెంసాంగ్స్ చేస్తున్న ఈ కాలంలో తను స్పెషల్ సాంగ్స్ చేయడంలో తప్పు లేదని చెబుతోంది. మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటెంసాంగ్ చేసింది ఈ చిన్నది. రారా రెడ్డి అనే లిరిక్స్ తో సాగే ఈ ఐటెంసాంగ్ లో నితిన్ తో కలిసి తొలిసారి స్టెప్పులేసింది. ఈ సందర్భంగా నితిన్ ను పొగిడేసింది ఈ బ్యూటీ. "రారా రెడ్డి నాకు స్పెషల్ సాంగ్. నితిన్ […]
మినిమం గ్యాప్స్ లో ఐటెంసాంగ్స్ చేయడంలో మజా ఉంటుందని చెబుతోంది అంజలి. హీరోయిన్లంతా ఐటెంసాంగ్స్ చేస్తున్న ఈ కాలంలో తను స్పెషల్ సాంగ్స్ చేయడంలో తప్పు లేదని చెబుతోంది. మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఐటెంసాంగ్ చేసింది ఈ చిన్నది. రారా రెడ్డి అనే లిరిక్స్ తో సాగే ఈ ఐటెంసాంగ్ లో నితిన్ తో కలిసి తొలిసారి స్టెప్పులేసింది. ఈ సందర్భంగా నితిన్ ను పొగిడేసింది ఈ బ్యూటీ.
"రారా రెడ్డి నాకు స్పెషల్ సాంగ్. నితిన్ గ్రేట్ డ్యాన్సర్. పక్కన డ్యాన్స్ చేయడం అంత తేలిక కాదు. పాట చివర్లో రానురాను అనే పల్లవి రావడం ఇంకా జోష్ ని నింపింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ పాటని, సినిమాని పెద్ద హిట్ చేయాలి" ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది అంజలి.
స్టార్ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్ లో మాస్ డ్యాన్స్ నంబర్ "రా రా రెడ్డి" లిరికల్ వీడియోను విడుదల చేశారు.
ప్రోమోలో కొన్ని అద్భుతమైన డ్యాన్స్‌లు కనిపించగా, లిరికల్ వీడియో మరింత అద్భుతంగా, మాస్ ఎలిమెంట్స్ తో నిండి ఉంది. విన్నవెంటనే మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఈ పాటని స్వరపరిచారు సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్. నితిన్ ఎనర్జీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, అంజలి గ్లామర్ ఈ పాటని ఇనిస్టెంట్ గా హిట్ చేశాయి.
కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. నితిన్ తొలి చిత్రం 'జయం' లోని రాను రాను అంటూనే చిన్నదో పాట పల్లవిని ఈ పాటలో చేర్చడం మరింత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.