శ్రీలంక ప్రధాని పదవికి రణిల్ విక్రమసింఘే రాజీనామా
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే శనివారం దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. . తాను రాజీనామా చేస్తానని, దేశంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రధాని గతంలోనే చెప్పారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని ఆయన కార్యాలయం తెలిపింది. శ్రీలంకలో ఇంధన పంపిణీ ఈ వారంలో పునఃప్రారంభం కానుందని, వరల్డ్ ఫుడ్ […]
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే శనివారం దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. . తాను రాజీనామా చేస్తానని, దేశంలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రధాని గతంలోనే చెప్పారు. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకు విక్రమసింఘే ప్రధానిగా కొనసాగుతారని ఆయన కార్యాలయం తెలిపింది.
శ్రీలంకలో ఇంధన పంపిణీ ఈ వారంలో పునఃప్రారంభం కానుందని, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఈ వారంలో దేశానికి రాబోతున్నారని, రుణ స్థిరత్వ నివేదికను దృష్టిలో ఉంచుకుని తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు విక్రమసింఘే పార్టీ నేతలకు తెలిపారు. IMF రుణం త్వరలో ఖరారు కానుంది. పౌరుల భద్రత కోసం, ప్రతిపక్ష పార్టీ నాయకుల ఈ సిఫార్సుకు తాను అంగీకరిస్తున్నట్లు ప్రధాని చెప్పారు.
కాగా ఇవ్వాళ్ళ ఉదయం నుండి కొలొంబో రణరంగాన్ని తలపించింది. వేలాది మంది నిరసనకారులు అధ్యక్షుడు గొటబయ రాజపక్సే నివాసాన్ని ఆక్రమించుకున్నారు.ఆర్మీ కాల్పుల వల్ల 50 మందికి పైగా నిరసనకారులు గాయాలపాలయ్యారు. అధ్యక్షుడు తన భవనాన్ని వదిలి పారిపోయాడు. అతను ఆర్మీ కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే గొటబయ దేశం విడిచి పారిపోయే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అధికారులు చెబుతున్నారు.