భగభగమండే సూర్యుడు జగన్..
అసలే ఆయన కొడాలి నాని, అందులోనూ ప్లీనరీ, ఆపై ఆయన ప్రసంగించిన సబ్జెక్ట్ ‘దుష్టచతుష్టయం – ఎల్లో మీడియా’. ఇక చూస్కోండి ఆ ప్రసంగం ఏ రేంజ్ లో ఉంటుందో. ప్లీనరీ రెండోరోజు ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. నలుగురి గురించి మీకు చెప్పాలంటూ మొదలు పెట్టిన నాని, ఆ నలుగుర్నీ కలిపి 420గాళ్లంటారని మండిపడ్డారు. గుడివాడ పక్కన ఉన్న గ్రామంలో పుట్టిన రామోజీరావు, హైదరాబాద్ వెళ్లి పచ్చళ్లు అమ్ముకుని, చివరకు పేపర్ […]
అసలే ఆయన కొడాలి నాని, అందులోనూ ప్లీనరీ, ఆపై ఆయన ప్రసంగించిన సబ్జెక్ట్ ‘దుష్టచతుష్టయం – ఎల్లో మీడియా’. ఇక చూస్కోండి ఆ ప్రసంగం ఏ రేంజ్ లో ఉంటుందో. ప్లీనరీ రెండోరోజు ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. నలుగురి గురించి మీకు చెప్పాలంటూ మొదలు పెట్టిన నాని, ఆ నలుగుర్నీ కలిపి 420గాళ్లంటారని మండిపడ్డారు.
గుడివాడ పక్కన ఉన్న గ్రామంలో పుట్టిన రామోజీరావు, హైదరాబాద్ వెళ్లి పచ్చళ్లు అమ్ముకుని, చివరకు పేపర్ పెట్టి, తన పేపర్ లో వచ్చిన వార్తలతోనే సీఎం కుర్చీలు మారిపోతుంటానే పిచ్చి భ్రమల్లో బతుకుతుంటారని అన్నారు. రెండోవ్యక్తి సైకిల్ పై ఇంటింటికీ వెళ్లి పేపర్లు వేస్తూ కెరీర్ మొదలు పెట్టిన రాధాకృష్ణ అని చెప్పారు.
మూడో వ్యక్తి బట్టతలపై వెంట్రుకలొస్తాయని హెయిర్ ఆయిల్ వ్యాపారం మొదలు పెట్టి ఐదారు వందల కోట్ల రూపాయలు సంపాదించిన బీఆర్ నాయుడు అని చెప్పారు నాని. వీరందరికీ కావాల్సిన వ్యక్తి, వారి జేబులో వ్యక్తి. మడతమంచం చంద్రబాబు.. అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు ఉంటేనే వీరి ఆటలు సాగుతాయని, ఇప్పుడు జగన్ సీఎం కుర్చీలో ఉన్నారు కాబట్టి, అర్జంట్ గా ఆయన్ని దింపేసేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఈ దొంగల ముఠా ఎన్ని కుట్రలు చేసినా వారు అనుకున్నది సాధించలేరని చెప్పారు.
నా గడ్డంలో వెంట్రుకైనా పీకగలరా..?
అలాంటి 420గాళ్లకు జగన్ కాదు కదా, తాను కూడా భయపడను అన్నారు. వారంతా కట్టగట్టుకుని వచ్చినా.. తన గడ్డంలో వెంట్రుక కూడా పీకలేరని చెప్పారు నాని. ఉదయం ఏడింటికే సూటు బూటు వేసుకున్న యాంకర్లు, పనికిమాలిన వెధవల్లాంటి మేధావుల్ని కూర్చోబెట్టి వారి ఛానెల్స్ లో డిబేట్లు చేస్తుంటారని, కోడిగుడ్డుపై ఈకలు పీకుతుంటారని అన్నారు. చంద్రబాబు మతి స్థిమితం తప్పి పిచ్చిపిచ్చిగా తిరుగుతున్నారని విమర్శించారు.
భగభగమండే సూర్యుడు..
జగన్ భగభగమండే సూర్యుడులాంటి వారని, ఆయనకు వేడినివ్వడం, కాంతినివ్వడం మాత్రమే తెలుసని.. ఆయన్ను ఎవరూ ఎదుర్కోలేరని అన్నారు. అప్పుడప్పుడు శనిగ్రహాల్లాగా రామోజీరావు, రాధాకృష్ణ లాంటి వాళ్లు.. ఐదు, పది నిముషాలు ఆయన ముందు పొర్లాడుతారని, సూర్యుడికి గ్రహణం పట్టినట్టుగా భ్రమింపజేస్తారని అన్నారు నాని. దుష్ట చతుష్టయంతోపాటు.. దత్తపుత్రుడు పవన్, ఉత్తుత్తి పుత్రుడు లోకేష్.. ఇలా ఆరుగుర్ని కలిపి గొయ్యితీసి పాతిపెట్టాలని, దానికి మీరు మేమూ సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కొడాలి నాని. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో కూడా గెలవలేని వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. రామోజీరావు, చంద్రబాబు అల్జీమర్స్ తో బాధపడుతున్నారని, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ పిచ్చెక్కిపోయి ఉన్నారని చెప్పారు. వీరంతా 2024 తర్వాత పిచ్చాసుపత్రిలో చేరతారని, దాని పేరు నారా చంద్రబాబు నాయుడు మానసిక వైకల్య కేంద్రం అని, ఆ ఆస్పత్రికి పసుపు రంగు వేసి ఉంటుందని చెప్పారు.
ఏడుస్తూ ఎవరైనా కళ్లు తుడుచుకుంటారు కానీ..!
కుమార్తె కాన్వొకేషన్ కోసం జగన్ ఫ్లైట్ లో వెళ్లారని కామెంట్ చేస్తున్న చంద్రబాబు.. ఆయన కొడుకు విదేశాల్లో చదువుతున్నప్పుడు నడిచి వెళ్లాడా, లేక సముద్రంలో ఈదుకుంటూ వెళ్లారా అని ప్రశ్నించారు. బాబుకి ఉచ్ఛ నీఛాలు లేవని, ఆయన తల్లిని అన్నా, భార్యని అన్నా, ఎవర్ని అన్నా పట్టించుకోరని, అసెంబ్లీలో ఎవరూ ఏమీ అనకపోయినా బయటకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చారని అన్నారు. అసలు ఏడుస్తూ ఎవరైనా ముక్కు తుడుచుకుంటారా, కళ్లు తుడుచుకుంటారా అని ప్రశ్నించారు..? కొడాలి నాని ప్రసంగిస్తున్నంత సేపు కార్యకర్తల ఈలలు, కేకలతో ప్లీనరీ ప్రాంగణం మారుమోగిపోయింది. కొడాలి పంచ్ లకు జగన్ కూడా చిరునవ్వులు చిందించారు.