టంగ్ స్లిప్ అయిన బాబు.. సోషల్ మీడియాలో బాదుడే బాదుడు..
వైసీపీ గౌరవ అద్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు విజయమ్మ. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. సీఎం జగన్ ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనుకోవడం కూడా పూర్తిగా ఆ పార్టీ వ్యవహారమే. అయితే ఈ విషయాలను అనవసరంగా ప్రస్తావించి విమర్శలు కొనితెచ్చుకున్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు.. సోషల్ మీడియాలో నెటిజన్లు బాదుడే బాదుడు అంటే ఎలా ఉంటుందో చూపెడుతున్నారు. ఇంతకీ బాబు ఏమన్నారు..? టీడీపీ రెండేళ్లకోసారి […]
వైసీపీ గౌరవ అద్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు విజయమ్మ. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. సీఎం జగన్ ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనుకోవడం కూడా పూర్తిగా ఆ పార్టీ వ్యవహారమే. అయితే ఈ విషయాలను అనవసరంగా ప్రస్తావించి విమర్శలు కొనితెచ్చుకున్నారు చంద్రబాబు. చిత్తూరు జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు.. సోషల్ మీడియాలో నెటిజన్లు బాదుడే బాదుడు అంటే ఎలా ఉంటుందో చూపెడుతున్నారు.
ఇంతకీ బాబు ఏమన్నారు..?
టీడీపీ రెండేళ్లకోసారి ప్లీనరీ పెట్టి ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షులను ఎన్నుకుంటామని, కానీ వైసీపీ మాత్రం అలాంటి ప్రజాస్వామ్య పోకడలకు ఫుల్ స్టాప్ పెట్టిందని అన్నారు చంద్రబాబు. “గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి విజయమ్మతో జగన్ రాజీనామా చేయించారు, ఈయన వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఉంటాడంట. అందుకు తీర్మానం చేయించుకుంటారంట. ఆ పార్టీలో ఇక ఎన్నికలే ఉండవంట. ఎవరికైనా ఇటువంటి చెత్త ఆలోచనలు వచ్చాయా? అది ఒక పార్టీనా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?” అని ప్రశ్నించారు బాబు.
బాబుపై కౌంటర్లు..
వైసీపీని ప్రశ్నించే ముందు అసలు చంద్రబాబు టీడీపీకి అధ్యక్షుడు ఎలా అయ్యారనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు నెటిజన్లు.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు బాబు..
కనీసం నందమూరి వారసులకి కూడా అవకాశాలివ్వలేదు.
అవకాశాలిచ్చినా వారిని అనామకులుగా మార్చేశారు.
ఎన్నికలప్పుడు నందమూరి కుటుంబాన్ని వాడుకుంటారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లాగా విసిరేస్తారు..
తనని తాను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకుని.. ఏపీ, తెలంగాణకు డమ్మీ నాయకుల్ని అధ్యక్షుల్ని చేశారు.
పార్టీపై అనధికారిక పెత్తనమంతా లోకేష్ దే.
ఇవీ చంద్రబాబుపై పడుతున్న కౌంటర్లు. ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్ ని అనవసరంగా చంద్రబాబు తనకు తానే ప్రజలకు గుర్తు చేసినట్టయింది. వైసీపీ అంతర్గత వ్యవహారాన్ని హైలెట్ చేసి, ఆనాడు ఎన్టీఆర్ నుంచి టీడీపీని ఎలా హస్తగతం చేసుకున్నారో మరోసారి జనానికి గుర్తు చేశారు. వైసీపీ అధ్యక్ష పదవిపై కామెంట్లు చేసిన చంద్రబాబు ఎరక్కపోయి ఇరుక్కుపోయారు, సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు.