Telugu Global
International

డీల్ క్యాన్సిల్.. ట్విట్టర్‌కు ఝలక్ ఇచ్చిన ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు ఝలక్ ఇచ్చాడు. గతంలో ట్విట్టర్ కొనుగోలుకు చేసుకున్న 44 బిలియన్ డాలర్ల డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ విలీన అగ్రిమెంట్‌కు సంబంధించిన పలు నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు మ‌స్క్‌ ప్రకటించాడు. కాగా, ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ఈ విషయంపై స్పందించారు. మస్క్ కుదుర్చుకున్న ట్విట్టర్ డీల్ అమలు జరిగేలా […]

డీల్ క్యాన్సిల్.. ట్విట్టర్‌కు ఝలక్ ఇచ్చిన ఎలాన్ మస్క్
X

ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు ఝలక్ ఇచ్చాడు. గతంలో ట్విట్టర్ కొనుగోలుకు చేసుకున్న 44 బిలియన్ డాలర్ల డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపాడు. సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ విలీన అగ్రిమెంట్‌కు సంబంధించిన పలు నిబంధనలను ఉల్లంఘించినందుకే ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు మ‌స్క్‌ ప్రకటించాడు. కాగా, ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ఈ విషయంపై స్పందించారు. మస్క్ కుదుర్చుకున్న ట్విట్టర్ డీల్ అమలు జరిగేలా లీగల్ యాక్షన్ తీసుకోవాలని బోర్డు నిర్ణయించినట్లు బ్రెట్ టేలర్ చెప్పారు.

ట్విట్టర్ బోర్డ్ ఇప్పటికీ ఈ డీల్ క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉందని, గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అదే ధరకు మస్క్ కొనాల్సిందేనని ఆయన చెప్పారు. ఫేక్, స్పామ్ అకౌంట్లకు సంబంధించిన వివరాలను ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైందని గతంలో మస్క్ తరపు లాయర్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కంపెనీ వ్యాపార నిర్వహణకు అతి ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఒప్పందంలో ఉన్న పలు నిబంధనలను ట్విట్టర్ ఉల్లంఘించిందని.. ఈ విలీనానికి సంబంధించి మస్క్‌ను ట్విట్టర్ బోర్డు తప్పుదోవ పట్టిస్తోందని పేర్కొన్నారు.

ట్విట్టర్ ఇటీవల అత్యున్నత అధికారులతో పాటు ముప్పావు వంతు టాలెంటెడ్ ఉద్యోగులను సంస్థ నుంచి సాగనంపింది. ఇది తనను బాధించిందని.. అందుకే డీల్ నుంచి బయటకు వచ్చేశానని మస్క్ పేర్కొన్నారు. ఉద్యోగులను తీసేయడం వల్ల ట్విట్టర్‌ను ఇప్పటిలాగే ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడం కష్టమవుతుందని మస్క్ అంటున్నారు.

ఎలాన్ మస్క్ నిర్ణయం ఒక సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెరతీయనుంది. మస్క్, ట్విట్టర్ మధ్య ఈ లీగల్ బ్యాటిల్ ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు. విలీనాలు, కొనుగోళ్ల వివాదాలకు సంబంధించిన కేసులు డెలావర్ కోర్టులో చాలా పెండింగ్‌లో ఉన్నాయి. ఇలాంటి కేసులు కోర్టు తీర్పులు ఇచ్చే వరకు కూడా నిలబడటం లేదని పేర్కొంటున్నారు. సాధారణంగా ఇవి కోర్టు బయట సెటిల్మెంట్ అవుతున్నాయని చెప్తున్నారు. కోర్టు కేసుల వల్ల పలు కంపెనీలు చిక్కుల్లో పడి నష్టాల పాలవుతున్నాయి. కాబట్టి మస్క్-ట్విట్టర్ కేసు కూడా బయట సెటిల్ చేసుకుంటే మంచిదని న్యాయ నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే ట్విట్టర్ మాత్రం కోర్టు ప్రొసీడింగ్స్ కొన్ని వారాల్లో ప్రారంభమవుతుందని.. ఏడాది లోపే దీనికి సంబంధించిన మ్యాటర్ సెటిల్ అవుతుందని ఆశిస్తోంది.

First Published:  9 July 2022 2:34 AM IST
Next Story