అగ్నిపథ్ పథకానికి, షింజో అబే హత్యకు లింక్.. కాంగ్రెస్ దారిలో తృణమూల్
కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకం పై ఇప్పటికీ విపక్షాలు గయ్యిమంటూనే ఉన్నాయి. జపాన్ మాజీ ప్రధాని షింజే అబే హత్యతో ఈ పథకానికి లింక్ పెడుతున్నాయి. నిన్నటికి నిన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్ పుత్.. ఈ హత్యపై స్పందిస్తూ జపాన్ సైన్యంలో పని చేసి పెన్షన్ అందక ఓ వ్యక్తి కసితో అబేను హతమార్చి ఉంటాడని అన్నారు. తెత్సుయా యమగామి అనే వ్యక్తి లోగడ జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ దళాల్లో పని చేశాడని, […]
కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకం పై ఇప్పటికీ విపక్షాలు గయ్యిమంటూనే ఉన్నాయి. జపాన్ మాజీ ప్రధాని షింజే అబే హత్యతో ఈ పథకానికి లింక్ పెడుతున్నాయి. నిన్నటికి నిన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్ పుత్.. ఈ హత్యపై స్పందిస్తూ జపాన్ సైన్యంలో పని చేసి పెన్షన్ అందక ఓ వ్యక్తి కసితో అబేను హతమార్చి ఉంటాడని అన్నారు.
తెత్సుయా యమగామి అనే వ్యక్తి లోగడ జపాన్ సెల్ఫ్ డిఫెన్స్ దళాల్లో పని చేశాడని, కానీ అతనికి పెన్షన్ అందలేదని తెలిసిందని ఆయన వ్యాఖ్యానించారు. మన అగ్నిపథ్ పథకాన్ని ఉద్దేశించి పరోక్షంగా ఆయన ఈ మాటలన్నారు. ఈ పథకం కింద యువకులు నాలుగేళ్లు సైన్యంలో పని చేశాక వారికి పెన్షన్ వంటి సౌకర్యాలు ఉండవు.
ఇప్పుడు తాజాగా బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యాన గల ‘జాగో బంగ్లా’ అనే వార్తా పత్రిక కూడా ఈ పథకం పట్ల ఇదే విధంగా స్పందించింది. అగ్నిపథ్ ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ఒక విధంగా షింజో అబే మృతికి దీనికి లింక్ పెట్టవచ్చునని ఈ పత్రిక పేర్కొంది. ఇలా మొదటి పేజీలోనే పెద్ద ఆర్టికల్ ప్రచురించింది.
యమగామి పెన్షన్ లేకుండానే జపాన్ సైనిక దళాల్లో పని చేశాడని తెలిపింది. ఇండియాలో అగ్నివీరులు నాలుగు లేదా నాలుగున్నర ఏళ్ళు సైన్యంలో పని చేశాక రిటైరయినట్టేనని, వారికి పింఛను, ఇతర ప్రయోజనాలు ఏవీ ఉండవని వ్యాఖ్యానించింది.
జపాన్ లో సుదీర్ఘ కాలం ప్రధానిగా వ్యవహరించిన షింజే అబే నిన్న నర సిటీలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా తెత్స్యుయా యమగామి అనే 41 ఏళ్ళ వ్యక్తి అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి స్టేజీపైనే కుప్పకూలిపోయిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
కొద్దిసేపటికే ఆయన మరణించారు. ఇంతకీ ఆయన్ను చంపిన షూటర్ ఎవరు ? జపాన్ సైన్యంలో 2002 నుంచి 2005 వరకు పని చేసిన ఇతగాడు.. షింజో అబే అంటే విపరీతమైన కోపం పెంచుకున్నాడట. షింజే హయాంలో తనకు ఎలాంటి ప్రయోజనాలూ దక్కలేదని ఇతడు పోలీసులకు చెప్పాడు. 2005 తరువాత ఓ ఫ్యాక్టరీలో కొంతకాలం పని చేశానని తెత్స్యుయా తెలిపాడు. ఇక చైనాలో ఓవర్గం షింజో అబే మృతిని సెలబ్రేట్ చేసుకుంది. షూటర్ తెత్స్యుయాను ఈ వర్గం ‘హీరో’గా అభివర్ణించింది. ‘లెట్ ద సెలబ్రేషన్స్ బిగిన్’ అని ఓ యూజర్ ట్వీట్ చేయగానే దానికి లక్షా 50 వేలకు పైగా లైక్స్ లభించాయట.