హాట్ హాట్ ప్రసంగాలు.. టేస్టీ భోజనాలు.. ప్లీనరీ సైడ్ లైట్స్
ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ ప్రసంగం కంటే.. యాదమ్మ వంటలే ఎక్కువ చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలంటే.. స్టేజ్ పై మాట్లాడే వక్తలు ఎవరెవరు అనే విషయాకలంటే, మధ్యాహ్నం భోజనంలో ఉండే వెరైటీలు ఎన్ని, అవి ఏవి అనే విషయాలే ఆసక్తిగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీలో కూడా ఫుడ్ మెనూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయమే ఈ ఫుడ్ మెనూపై ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం. […]
ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోదీ ప్రసంగం కంటే.. యాదమ్మ వంటలే ఎక్కువ చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ నాయకుల సభలు, సమావేశాలంటే.. స్టేజ్ పై మాట్లాడే వక్తలు ఎవరెవరు అనే విషయాకలంటే, మధ్యాహ్నం భోజనంలో ఉండే వెరైటీలు ఎన్ని, అవి ఏవి అనే విషయాలే ఆసక్తిగా మారుతున్నాయి. తాజాగా వైసీపీ రాష్ట్రస్థాయి ప్లీనరీలో కూడా ఫుడ్ మెనూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయమే ఈ ఫుడ్ మెనూపై ఓ ప్రకటన విడుదల చేయడం విశేషం.
25 రకాల వంటకాలు..
ప్లీనరీ ఫుడ్ మెనూలో 25 రకాల వంటకాలు ఉంటాయని ప్రకటించారు. తొలిరోజు రెండున్నర లక్షలమందికి సరిపడా భోజనాలు సిద్ధం చేస్తున్నారట. 250 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి భోజనం వడ్డిస్తారు. మధ్యాహ్నం 11 గంటలనుంచే భోజనం హడావిడి మొదలవుతుంది. 3 గంటల వరకు, లేదా ప్లీనరీకి వచ్చిన అతిథులంతా భోజనం చేసే వరకు ఈ వడ్డింపు కొనసాగుతుంది. ఇక ఐటమ్స్ విషయానికొస్తే.. మాంసాహార ప్రియులకోసం మటన్ థమ్ బిర్యానీ, చికెన్ రోస్ట్, చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, రొయ్యల కూర, కోడిగుడ్లు సిద్ధం చేస్తున్నారు. శాకాహారులకోసం చపాతీ, వెజ్ బిర్యానీ, బంగాళాదుంప కూర, మునగకాయల కూర, ఉలవచారు, సాంబారు, మజ్జిగ పులుసు.. ఇలాంటి వెరైటీలున్నాయి. తాపేశ్వరం కాజా, బ్రెడ్ హల్వా.. స్వీట్లలో ఉన్న వెరైటీలు. పచ్చళ్లు, పెరుగు వెరైటీలు, ఫ్రూడ్ సలాడ్, వడియాలు, సమోసాలు.. కామన్ గా ఉంటాయి.
ఈరోజు, రేపు.. గుంటూరుజిల్లా నాగార్జున యూనివర్శిటీ ఎదురు ఉన్న బహిరంగ ప్రదేశంలో వైసీపీ ప్లీనరీ జరుగుతుంది. ముందుగా తొలిరోజు తీర్మానాలపై ఓ ప్రకటన విడుదల చేసిన వైసీపీ ఆ తర్వాత ఫుడ్ మెనూ గురించి ప్రకటించింది. గతంలో జరిగిన ప్లీనరీల సందర్భంలో ఫుడ్ మెనూ ఈ స్థాయిలో హైలెట్ కాలేదు. అతిథులకు రకరకాల విందు భోజనాలు వడ్డించే ఆనవాయితీ టీడీపీ మహానాడుతో మొదలైందని చెప్పాలి. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్లీనరీల్లో ఈ హడావిడి కనిపించింది. ఇటీవల బీజేపీ కూడా దీన్ని కొనసాగించడం విశేషం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా యాదమ్మ వంటలు, ఆమె ఇంటర్వ్యూలు బాగా హైలెట్ అయ్యాయి. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్లీనరీకి వంట మాస్టర్ ఎవరనేది చెప్పలేదు కానీ, వంటల గురించి మాత్రం ఆసక్తి కలిగించేలా ప్రకటన విడుదల చేశారు.