Telugu Global
NEWS

విజయవాడ, గుంటూరు వైపు వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ గమనించండి

ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ, రేపు (జూలై 8, 9) ప్లీనరీని నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తోన్న తొలి ప్లీనరీ కావడంతో భారీ ఏర్పాట్లు చేసింది. తొలి రోజు 2.50 లక్షల మంది.. రెండో రోజు ప్లీనరీ, బహిరంగ సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి ఆనుకొనే ఉన్న భారీ స్థ‌లంలో ఈ ప్లీనరీ నిర్వహిస్తుండటంతో.. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల […]

విజయవాడ, గుంటూరు వైపు వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ గమనించండి
X

ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ, రేపు (జూలై 8, 9) ప్లీనరీని నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తోన్న తొలి ప్లీనరీ కావడంతో భారీ ఏర్పాట్లు చేసింది.

తొలి రోజు 2.50 లక్షల మంది.. రెండో రోజు ప్లీనరీ, బహిరంగ సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి ఆనుకొనే ఉన్న భారీ స్థ‌లంలో ఈ ప్లీనరీ నిర్వహిస్తుండటంతో.. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని ఏపీ పోలీసులు చెప్పారు.

కాబట్టి విజయవాడ, గుంటూరు వైపు ప్రయాణించే వాహనదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తమ ప్రయాణ మార్గాన్ని ఎంచుకోవాలని కోరుతున్నారు.

ట్రాఫిక్ డైవ‌ర్ష‌న్స్‌ ఇలా..

– చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వెళ్లే భారీ రవాణా వాహనాలను ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద మళ్లించనున్నారు. ఈ వాహనాలు చీరాల, బాపట్ల, రేపల్లి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకొని విశాఖపట్నం, ఇబ్రహీంపట్నం వెళ్లాలి.

– చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలి.

– చిలకలూరిపేట నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు పెద‌నందిపాడు, కాకుమాను, పొన్నూరు, చందోలు, చెరుకుపల్లి, భట్టిప్రోలు, పెనుమూడి వంతెన, అవనిగడ్డ మీదుగా హనుమాన్ జంక్షన్ చేరుకొని అటు నుంచి వైజాగ్ వెళ్లాలి.

– గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు బుడంపాడు క్రాస్ రోడ్ వద్ద మళ్లి.. తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.

– గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాల్సిన వాహనాలు.. తాడికొండ, తుళ్లూరు, వెంకటపాలెం, ఎర్రబాలెం, ఉండవల్లి సెంటర్, తాడేపల్లి పెట్రోల్ బంక్, వారధి మీదుగా విజయవాడ వెళ్లాలి.

– రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను దేవరపల్లి వద్ద మళ్లిస్తారు. జంగారెడ్డిగూడెం, సత్తుపల్లి, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లాలి. భారీ వాహనాలు అయితే హనుమాన్ జంక్షన్ వద్ద మళ్లించి నూజివీడు, మైలవరం, జి.కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకొని హైదరాబాద్ వెళ్లాలి.

– గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కేసరపల్లి, ముస్తాబాద, ఇన్నర్ రింగ్ రోడ్డు, పైపుల రోడ్డు మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకొని.. హైదరాబాద్ వెళ్లాలి.

– భారీ సరుకు వాహనాలు గన్నవరం నుంచి ఆగిరిపల్లి, జి. కొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలి.

– మల్టీ యాక్సెల్ రవాణా వాహనాలను దారి మళ్లించకుండా పూర్తిగా నిలిపివేస్తారు. చెన్నై నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలను చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద ఆపేసి.. రాత్రి 10 గంటల తర్వాత అనుమతిస్తారు. వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద నిలిపేసి.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య అనుమతి ఇస్తారు.

ప్లీనరీ పార్కింగ్ ఇలా:

ఇక ప్లీనరీకి వచ్చే వాహనాల కోసం భారీగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయ్ వాహనాలు జేఎంజే స్కూల్, సెయింట్ ఆన్స్ స్కూల్ కాంపౌండ్‌లో నిలుపుతారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, జెడ్పీచైర్మన్ల వాహనాలు బైబిల్ మిషన్ బిల్డింగ్‌ పక్కన ఉన్న ప్లేస్‌లో నిలుపుకోవచ్చు.

– విజయవాడ నుంచి వచ్చే బస్సులకు కాజా టోల్‌గేట్ వద్ద ఉన్న ఆర్కే వెనుజియా లేఅవుట్ వద్ద పార్కింగ్ కల్పించారు.

– విజయవాడ నుంచి వచ్చే కార్లు, ఆటోలు, టూవీలర్లు ఏఎన్‌యూ నార్త్, మెయిన్ గేట్, సౌత్ గేట్ వద్ద పార్కింగ్ చేయవచ్చు. అయోధ్య రామిరెడ్డి అండ్ సన్స్ ఫంక్షన్ హాల్ వద్ద కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు.

– గుంటూరు వైపు నుంచి వచ్చే బస్సులు నంబూరు, కంతేరు రోడ్డు పక్కన నిలపాలి.

– గుంటూరు వైపు నుంచి వచ్చే కార్లు, ఆటోలు, టూవీలర్లు అమలోద్భవి హోటల్ ప్రాంగణం, జైన్ ఆలయం, దశావతార ఆలయం, కేశవరెడ్డి స్కూల్ గ్రౌండ్, కంతేరు రోడ్డు రైల్వే గేటు నుంచి సాయి భారత హోం వరకు, ఎడ్ల పందేల ర్యాంప్, పల్లలమ్మ చెరువు నుంచి కంతేరు రోడ్డు వరకు, ఖలీల్ దాబా వెనుక వైపు, రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్ సమీపంలో నిలపవచ్చు.

First Published:  8 July 2022 4:01 AM IST
Next Story