Telugu Global
Health & Life Style

ప్రాణాంతకర వైరస్ వస్తోంది.. హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్‌లు పుట్టుకొని వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయగా.. దాని వేరియంట్‌లు ఇంకా విస్తృతంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. కరోనా సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా చాలా మంది ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో మరో ప్రమాదకర వైరస్ ఉనికి ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలోప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. రెండు వారాల క్రితం ఇద్దరికి ఈ వైరస్ సోకగా.. వారు […]

ప్రాణాంతకర వైరస్ వస్తోంది.. హెచ్చరించిన డబ్ల్యూహెచ్ఓ
X

ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్‌లు పుట్టుకొని వస్తున్నాయి. కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయగా.. దాని వేరియంట్‌లు ఇంకా విస్తృతంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. కరోనా సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా చాలా మంది ఇప్పటికీ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో మరో ప్రమాదకర వైరస్ ఉనికి ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలోప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్ వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. రెండు వారాల క్రితం ఇద్దరికి ఈ వైరస్ సోకగా.. వారు ప్రాణాలు కోల్పోయారు.

మార్బర్గ్ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఇద్దరితో కాంటాక్ట్‌ కలిగిన 34 మందిని అధికారులు గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించారు. వారందరి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్‌కు సంబంధించిన నమూనాలను బాధితుల నుంచి సేకరించారు. వాటిని పరిశీలనకు పంపించిన సమయంలో వారిద్దరూ మృతి చెందారు. కాగా, మార్బర్గ్ వైరస్‌కు సంబంధించిన పూర్తి నిర్ధారణ కోసం ప్రస్తుతం ఆ నమూనాలను సెనెగల్ లోని పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

మార్బర్గ్ వైరస్ చాలా ప్రాణాంతకమైనది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఎబోలా కుటుంబానికి చెందిన వైరస్ అని స్పష్టం చేసింది. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులను లేదా వ్యక్తులను నేరుగా తాకడం, వాళ్లు తాకిన ప్రదేశాలను ముట్టుకోవడం, వారు వాడిన వస్తువులు, దుస్తులు వాడటం వల్ల ఇది సోకుతుందని చెప్పింది. అత్యంత వేగంగా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

వైరస్ సోకిన రెండు రోజుల నుంచి 21 రోజుల్లోగా లక్షణాలు కనపడతాయని చెప్పింది. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఆయాసం వంటి లక్షణాలు ఈ వైరస్ వల్ల కలుగుతాయన్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా కొందరిలో రక్తస్రావం కూడా జరుగుతుందని.. అది ప్రాణాంతకంగా మారుతుందని వెల్లడించింది. ఈ వైరస్ సోకడం వల్ల 88 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఈ వైరస్ నివారణకు, చికిత్సకు వ్యాక్సిన్లు, మందులు లేవని చెప్పింది. లక్షణాలను బట్టి చికిత్స చేయడం తప్ప మరో మార్గం లేదని డ‌బ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.

First Published:  8 July 2022 9:05 AM GMT
Next Story