Telugu Global
NEWS

ప్రమోషన్ తగ్గింది.. ఉంగరం ట్రిక్ అదిరింది..

తెలుగు రాష్ట్రాల్లోని మీడియా ఛానెల్స్ అన్నీ.. రెండురోజులుగా చంద్రబాబు ఉంగరం గురించి కథనాలు వండి వార్చాయి. చంద్రబాబు కొత్త ఉంగరం పెట్టుకున్నారు, అది హైటెక్ ఉంగరం, దానిలో ఉన్న సుగుణాలు చూడండి అంటూ ఊదరగొట్టాయి. అసలు చంద్రబాబు ఏ ఉంగరం పెట్టుకుంటే జనాలకి ఉపయోగం ఏంటి..? ఆయన ఉంగరం పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి..? ఇక్కడ మీడియాని తప్పుబట్టలేం, బాబు ప్రమోషన్ మైండ్ గేమ్ ని మెచ్చుకోకుండా ఉండలేం. ఈమధ్య కాలంలో చంద్రబాబు వార్తలంటే ఆ మూడు […]

ప్రమోషన్ తగ్గింది.. ఉంగరం ట్రిక్ అదిరింది..
X

తెలుగు రాష్ట్రాల్లోని మీడియా ఛానెల్స్ అన్నీ.. రెండురోజులుగా చంద్రబాబు ఉంగరం గురించి కథనాలు వండి వార్చాయి. చంద్రబాబు కొత్త ఉంగరం పెట్టుకున్నారు, అది హైటెక్ ఉంగరం, దానిలో ఉన్న సుగుణాలు చూడండి అంటూ ఊదరగొట్టాయి. అసలు చంద్రబాబు ఏ ఉంగరం పెట్టుకుంటే జనాలకి ఉపయోగం ఏంటి..? ఆయన ఉంగరం పెట్టుకుంటే ఏంటి, పెట్టుకోకపోతే ఏంటి..? ఇక్కడ మీడియాని తప్పుబట్టలేం, బాబు ప్రమోషన్ మైండ్ గేమ్ ని మెచ్చుకోకుండా ఉండలేం.

ఈమధ్య కాలంలో చంద్రబాబు వార్తలంటే ఆ మూడు ఛానెళ్లు మినహా మిగతా వాళ్లు పట్టించుకోవట్లేదు. టీడీపీ మినీమహానాడులు కూడా కేవలం ఆయా మీడియా సంస్థలే కవర్ చేస్తాయి కానీ మిగతావాళ్లు లైట్ తీసుకుంటున్నారు. ఈ దశలో బాబు ఉంగరం కాన్సెప్ట్ తో హైలెట్ అయ్యారు. ఇంత వయసొచ్చినా ఇంకా టెక్నాలజీ వాడకంలో బాబు టాప్ అని ప్రచారం చేసుకోవడమే ఆయన కాన్సెప్ట్. తనకు తాను ఉంగరం పెట్టుకుని సైలెంట్ గా ఉంటే ఎవరికీ అనుమానం రాదని అనుకున్నారేమో.. ఆ హైటెక్ ఉంగరం గురించి తనకు తానే కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. రాజంపేట నియోజకవర్గ సమీక్షలో ఉంగరం, దాని విశిష్టతలు అంటూ పావుగంటసేపు కార్యకర్తలకు క్లాస్ తీసుకున్నారు బాబు.

హార్ట్ బీట్, వాకింగ్ టైమ్, స్లీపింగ్ టైమ్.. ఇలాంటివన్నీ ఆ ఉంగరంలో ఉన్న చిప్ లో నిక్షిప్తం అవుతాయని, ప్రతి రోజూ మనం ఆ డేటా విశ్లేషించి ముందుకు సాగాలన్నారు చంద్రబాబు. ఇప్పట్లో అందరూ వాడే స్మార్ట్ వాచీలు చేసే పనికూడా అదే. అయితే స్మార్ట్ వాచీ కాకుండా, అందులో ఉండే చిప్ ని ఓ చిన్న ఉంగరంలో వేసి దాన్ని ధరించారు బాబు. అందులో వింతేముంది. కానీ బాబు పెట్టుకున్నారు కాబట్టి, అది వింతే. పోనీ ఆయన అనుకూల మీడియా దాన్ని హైలెట్ చేసిందంటే ఓ అర్థముంది.. చంద్రబాబుకి వైరి వర్గంగా భావించే మీడియా కూడా ఆయన ట్రాప్ లో పడిపోడవమే విశేషం. ఉంగరం, ఉంగరం, ఉంగరం.. హైటెక్ బాబు.. అంటూ ఉచిత ప్రచారం ఇచ్చారు. ఆయనకు కావాల్సింది కూడా అదే. మహానాడుకి జనాదరణలేదని బాధపడుతున్న బాబు, ఇలా ఉంగరం కథ చెప్పి అందరినీ తనవైపు తిప్పుకున్నారు.

First Published:  8 July 2022 1:40 AM IST
Next Story