Telugu Global
NEWS

ఏపీ మీద పడ్డ పాల్ – త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన

ప్రముఖ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత దృష్టి ఇప్పుడు ఏపీ మీద పడింది. ఈ నెల 9 నుంచి 15 వరకు ఆయన ఏపీలో యాత్ర చేస్తారట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కేఏ పాల్.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. మళ్లీ ఇటీవల తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓ జిల్లాలో పర్యటిస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు దాడి చేశారు కూడా.. […]

ఏపీ మీద పడ్డ పాల్ – త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన
X

ప్రముఖ మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత దృష్టి ఇప్పుడు ఏపీ మీద పడింది. ఈ నెల 9 నుంచి 15 వరకు ఆయన ఏపీలో యాత్ర చేస్తారట. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కేఏ పాల్.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. మళ్లీ ఇటీవల తెలంగాణలో ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓ జిల్లాలో పర్యటిస్తుంటే టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు దాడి చేశారు కూడా.. ఇక ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను కలిసొచ్చారు. దీంతో ఆయనను కొన్ని మీడియా సంస్థలు ఇంటర్వ్యూ కూడా చేశాయి.

అయితే మొత్తంగా కేఏ పాల్‌ను తెలుగురాష్ట్రాల ప్రజలు ఓ కామెడీ నేతగా చూస్తున్నారు తప్ప.. సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆయన చర్యలు కూడా అలాగే ఉంటాయి.ఇదిలా ఉంటే తెలంగాణలో పలు జిల్లాల్లో పర్యటించిన కేఏ పాల్ తాజాగా ఏపీ మీద పడ్డారు. ఆయన తన సొంత జిల్లా విశాఖపట్నం నుంచి యాత్రను ప్రారంభించబోతున్నారంటూ ప్రజాశాంతి పార్టీ చెబుతోంది. ఏపీ లోని పలు జిల్లాల గుండా ఈ యాత్ర కొనసాగుతుందని.. రాష్ట్ర ప్రజలు సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు పాల్ కృషి చేస్తారని ఆ పార్టీ చెబుతోంది.

చివరకు 15 వ తేదీన కర్నూలులో ప్రజాశాంతి పార్టీ యాత్ర ముగుస్తుందట. ఔత్సాహికులను తమ పార్టీలో చేర్చుకుంటామని.. సీరియస్ గా పనిచేసేవాళ్లు మాత్రమే తమ పార్టీలో చేరాలని ప్రజాశాంతి అంటోంది. మరి కనీసం ఆ పార్టీకి అయినా సీరియస్ నెస్ ఉందో లేదో? వేచి చూడాలి. ఆయన ఏపీలో చేయబోయే యాత్రతో కొన్ని యూట్యూబ్ చానళ్లకు, మీడియా సంస్థలకు మాత్రం స్టఫ్ దొరకబోతున్నది. తెలంగాణలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన పాల్.. ఏపీలో జగన్ ను కూడా టార్గెట్ చేస్తారేమో? వేచి చూడాలి.

First Published:  8 July 2022 2:26 AM IST
Next Story