జపాన్ మాజీ ప్రధాని షింజే అబే దారుణ హత్య
జపాన్ మాజీ ప్రధాని షింజే దారుణ హత్యకు గురయ్యారు. నారా సిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వెనుక వైపు నుంచి ఆగంతకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా షింజో అబే నారా సిటీలో వేదికపై ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో ఆయన రక్తమోడుతూ కింద పడిపోయారని తెలిసింది. […]

జపాన్ మాజీ ప్రధాని షింజే దారుణ హత్యకు గురయ్యారు. నారా సిటీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వెనుక వైపు నుంచి ఆగంతకుడు ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రక్తమోడుతున్న ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా షింజో అబే నారా సిటీలో వేదికపై ప్రసంగిస్తుండగా కాల్పులు జరగడంతో ఆయన రక్తమోడుతూ కింద పడిపోయారని తెలిసింది. ఒక్కసారిగా గన్ షాట్స్ శబ్దం వినిపించాయని, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షింజో అబేని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు
జపాన్ ప్రధానిగా సుదీర్ఘకాలం వ్యవహరించిన షింజో అబే.. తన ఆరోగ్య కారణాల దృష్ట్యా పదవికి రాజీనామా చేస్తున్నట్టు 2020 ఆగస్టులో ప్రకటించారు.
ప్రజలు తనకిచ్చిన బాధ్యతలను తన ఆరోగ్య కారణాలవల్ల సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, అందువల్ల రాజీనామా చేస్తున్నానని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. నారా సిటీలో జరిగిన ఘటనలో ఆయన ఛాతీపై దుండగుడు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.