బిడ్డా.. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి అడ్డా..
తొలిరోజు ప్లీనరీ ప్రసంగాల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవేశంగా మాట్లాడారు. టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. జగన్ కనుసైగ చేస్తే చాలు టీడీపీ నేతల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తామని హెచ్చరించారు. పప్పు లోకేష్ సీఎం జగన్ ని ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చేప చర్మం వలిచేసినట్టు వారి చర్మం వలిచేస్తామన్నారు. లోకేష్ మాటలకు తమ రక్తం మరుగుతోందని, అయితే సీఎం జగన్ నేర్పించిన సంస్కారంతో తామంతా హుందాగా వ్యవహరిస్తున్నామని […]
తొలిరోజు ప్లీనరీ ప్రసంగాల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవేశంగా మాట్లాడారు. టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. జగన్ కనుసైగ చేస్తే చాలు టీడీపీ నేతల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తామని హెచ్చరించారు. పప్పు లోకేష్ సీఎం జగన్ ని ఉద్దేశించి తప్పుగా మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చేప చర్మం వలిచేసినట్టు వారి చర్మం వలిచేస్తామన్నారు. లోకేష్ మాటలకు తమ రక్తం మరుగుతోందని, అయితే సీఎం జగన్ నేర్పించిన సంస్కారంతో తామంతా హుందాగా వ్యవహరిస్తున్నామని అన్నారు.
మంత్రి పదవి పీకేశారంటూ తప్పుడు ప్రచారం..
సామాజిక సమీకరణాలలో భాగంగా కొంతమందికి మంత్రి పదవులు దూరమయ్యాయని అంతే కాని తమనెవరూ మంత్రి పదవుల్లోనుంచి పీకేయలేదని చెప్పారు అనిల్ కుమార్ యాదవ్. మంత్రి పదవులు కోల్పోయిన తర్వాత బాధ్యతలు తక్కువగా ఉండటంతో కాస్త రీచార్జి అయ్యామని, రీచార్జ్ అయితే ఎలా ఉంటుందో, రీసౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, వైసీపీ కార్యకర్తల గుండెలు చీల్చినా జగనన్నే కనిపిస్తాడని చెప్పారు అనిల్.
టార్గెట్ 175..
2024 ఎన్నికల్లో 175 స్థానాలు టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తామని చెప్పారు మాజీ మంత్రి అనిల్. ఈసారి కూడా తమ లెక్క తప్పదని, 175 స్థానాల్లో విజయం సాధించి మరో పాతికేళ్లపాటు జగన్ ని సీఎంగా చేసుకుంటామని అన్నారు. జగన్ సీఎం కుర్చీని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు అనిల్. చంద్రబాబు వచ్చినా, ఆయన దత్తపుత్రుడు వచ్చినా సీఎం కుర్చీని కదల్చలేరని చెప్పారు. వైఎస్ఆర్ కుటుంబానికి తామంతా వీర విధేయులమని చెప్పారు.