Telugu Global
Health & Life Style

మీకు నిద్రలో చెమటలు పట్టుతున్నాయా?

వేడి ఉష్ణోగ్రత, వెంటిలేషన్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు రాత్రి పూట చెమటలు పడుతుంటాయి. అయితే అదే మీకు తరుచుగా జరుగుతుంటే మాత్రం దాని వెనుక కొన్ని సహజమైన కారణాలు ఉండవచ్చు. మీ ఎయిర్ కండిషనింగ్ బాగా పనిచేసినప్పటికీ, మీరు తరచుగా రాత్రిపూట చెమటతో మేల్కొంటారా? దాని వెనుక ఉన్న కారణాన్ని ఆలోచించారా? వేడి ఉష్ణోగ్రత, వెంటిలేషన్ లేకపోవడం వల్ల కొన్ని సమయాల్లో రాత్రి పూట చెమటలు పట్టవచ్చు. తరచుగా ఇదే సమస్య ఎదురైతే కనుక దానికి ఎక్కువ […]

మీకు నిద్రలో చెమటలు పట్టుతున్నాయా?
X

వేడి ఉష్ణోగ్రత, వెంటిలేషన్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు రాత్రి పూట చెమటలు పడుతుంటాయి. అయితే అదే మీకు తరుచుగా జరుగుతుంటే మాత్రం దాని వెనుక కొన్ని సహజమైన కారణాలు ఉండవచ్చు.

మీ ఎయిర్ కండిషనింగ్ బాగా పనిచేసినప్పటికీ, మీరు తరచుగా రాత్రిపూట చెమటతో మేల్కొంటారా? దాని వెనుక ఉన్న కారణాన్ని ఆలోచించారా?

వేడి ఉష్ణోగ్రత, వెంటిలేషన్ లేకపోవడం వల్ల కొన్ని సమయాల్లో రాత్రి పూట చెమటలు పట్టవచ్చు. తరచుగా ఇదే సమస్య ఎదురైతే కనుక దానికి ఎక్కువ ఒత్తిడికి గురికావడం, నిద్రవేళకు ముందు మద్యం సేవించడం, కొన్ని మందులు తీసుకోవడం, మధుమేహం, ఆందోళన రుగ్మతలు, థైరాయిడ్ సమస్యలు లేదా పెరిమెనోపాజ్ వంటివి రాత్రిపూట చెమటలు పట్టడానికి కొన్ని కారణాలని నిపుణులు చెబుతున్నారు.

• సాయంత్రం మద్యం సేవిస్తే రాత్రికి చెమటలు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది చెమటకు దారితీస్తుంది. ఆల్కహాల్ శ్వాసనాళాలను సడలించి, శ్వాసను బరువుగా తీసుకునేలా చేస్తుంది. అంతేకాకుండా గండె వేగాన్ని పెంచేలా చేస్తుంది. ఈ రెండు కారణాలు మీ శరీర ఉష్ణోగ్రతను పెంచి చెమటను పట్టేలా చేస్తాయి.

థైరాయిడ్ రుగ్మతలు: థైరాయిడ్ గ్రంధి జీవక్రియతో సహా అనేక శారీరక విధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా అత్యంత చురుకైన థైరాయిడ్ గ్రంధి, రాత్రి చెమటలను కలిగించే వేడికి శరీరాన్ని సున్నితంగా చేస్తుంది.

ఒత్తిడికి గురవుతున్నారా: అతి చురుకైన మనస్సు మీ మెదడును, శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇది రాత్రిపూట మీకు చెమట పట్టేలా చేస్తుంది. పుస్తకం చదవడం, వెచ్చని స్నానం చేయడం లేదా సంగీతం వినడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

ఆందోళన రుగ్మతలు: ఆందోళన, ఒత్తిడి అనేది అనేక రకాల శారీరక రోగాలకు కారకాలుగా మారతాయి. OCD, SAD లేదా PTSD వంటి రుగ్మతలు ఉన్నవారు ఆందోళన కారణంగా రాత్రిపూట చెమటలు పట్టే అవకాశం ఉంది.

మెనోపాజ్ ద్వారా వెళ్లడం: పెరిమెనోపాజ్ అయిన స్త్రీలు రాత్రిపూట చెమటలు పట్టడం చాలా సాధారణం. ఆల్కహాల్, కారంగా ఉండే ఆహారాలు, కెఫిన్, ధూమపానం రాత్రి సమయంలో చెమటను ప్రేరేపిస్తాయి. కాబట్టి, రాత్రిపూట వాటికి దూరంగా ఉండటమే మంచిది.

కొన్ని మందులు: యాంటిడిప్రెసెంట్స్, యాంటీరెట్రోవైరల్స్ లేదా హైపర్‌టెన్షన్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత లేదా స్వేద గ్రంధులను నియంత్రించే మెదడులోని భాగాలపై ప్రభావం చూపుతుంది. ఈ మందులు రాత్రి సమయంలో చెమటను ప్రేరేపించడానికి కారణమవుతాయి. ఈ సమస్యకు వైద్యుల సలహా సూచలు పాటించడం ఎంతైనా అవసరం.

TB లేదా HIV వంటి కొన్ని అంటువ్యాధులు: TB, HIV లేదా లుకేమియా వంటి రక్త రుగ్మతలతో సహా అనేక రకాల ఇన్ఫెక్షన్‌లకు రాత్రి చెమటలు బలమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇన్ఫెక్షన్‌లు జ్వరం, శరీరం వేడెక్కడం వల్ల రాత్రిపూట చెమటలు పట్టే అవకాశం ఉందని డాక్టర్ చెపుతున్నారు.

First Published:  8 July 2022 2:54 PM IST
Next Story