Telugu Global
NEWS

నా గుండె బెదరలేదు.. నా సంకల్పం చెదరలేదు

2009, సెప్టెంబర్‌ 25న పావురాలగుట్టలో మొదలైన సంఘర్షణ.. 13 ఏళ్లుగా కొనసాగుతోందని అన్నారు సీఎం జగన్. వైసీపీ ప్లీనరీలో ప్రసంగించిన ఆయన.. వైఎస్సార్ ఆశయాల సాధనకోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. 13 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా.. తన గుండె బెదరలేదని, తన సంకల్పం చెక్కు చెదరలేదని అన్నారు జగన్. జగమంత కుటుంబం తన చేయి ఎప్పుడూ వదల్లేదని చెప్పారు. తనను ప్రేమించి తనకు వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ […]

YS Jagan Mohan Reddy
X

2009, సెప్టెంబర్‌ 25న పావురాలగుట్టలో మొదలైన సంఘర్షణ.. 13 ఏళ్లుగా కొనసాగుతోందని అన్నారు సీఎం జగన్. వైసీపీ ప్లీనరీలో ప్రసంగించిన ఆయన.. వైఎస్సార్ ఆశయాల సాధనకోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని చెప్పారు. 13 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా.. తన గుండె బెదరలేదని, తన సంకల్పం చెక్కు చెదరలేదని అన్నారు జగన్. జగమంత కుటుంబం తన చేయి ఎప్పుడూ వదల్లేదని చెప్పారు. తనను ప్రేమించి తనకు వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా‌నని అన్నారు జగన్.

151 స్థానాల్లో విజయం అందించి ప్రజలు అధికారం కట్టబెట్టారని, అదే సమయంలో ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు దేవుడు పరిమితం చేశాడని చెప్పారు జగన్. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైసీపీ అని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు జగన్. అధికారంలోకి వచ్చాక మూడేళ్ల ప్రయాణం ఎన్నో పోరాటాల ప్రస్థానం అని చెప్పారు. రైతులపై మమకారం అంటే ఇలా ఉంటుందని నిరూపించామని, ప్రతిపక్షాలు ఎన్ని రాళ్లు వేసినా, ఎన్ని నిందలు వేసినా, ఎన్నికుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా ఎదుర్కొన్నామని అన్నారు. “మన పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. కాబట్టి గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు” అని అన్నారు జగన్.

వైసీపీ పాలనపై దుష్ట చతుష్ట​యం విషప్రచారం చేస్తోందని, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారని అన్నారు జగన్. ఆయన కట్టుకథలకు అబద్ధాలు జోడించి ఎల్లోమీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గతంలో రాష్ట్రాన్ని దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా వ్యవహరించిందని, ఇప్పుడు అవకాశం లేక కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో ఉందని, గజదొంగల ముఠా మాత్రం, ఎల్లో మీడియా, ఎల్లో సోషల్‌ మీడియాలో మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు.

పదవి అంటే అధికారం కాదు, ప్రజల మీద మమకారం అని నిరూపించామని చెప్పారు జగన్. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ప్రతిక్షణం తపనపడ్డామని, అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు నిలదీస్తారేమోనని టీడీపీ తన మేనిఫెస్టోనే మాయం చేసిందని ఎద్దేవా చేశారు జగన్. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మేనిఫెస్టో అంటే ఓ ప్రతిజ్ఞగా అమలు చేసి చూపించామన్నారు. మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి 95 శాతం హామీలు అమలు చేశాంమని, వైసీపీ మేనిఫెస్టోను చూడటానికే టీడీపీ భయపడిపోతోందని అన్నారు.

First Published:  8 July 2022 11:04 AM IST
Next Story