ప్లీనరీకి భారీ భద్రత.. 4 కేటగిరీల్లో పాస్ లు.. 4 లక్షలమంది వస్తారని అంచనా..
వైసీపీ ప్లీనరీకి సీఎం జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ హాజరవుతుండటంతో.. భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ అధికారులు. ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కోసం 25 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ భద్రతా ఏర్పాట్లను సీపీ కాంతిరాణా టాటా పర్యవేక్షించారు. రెండు రోజులపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్లీనరీ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో […]
వైసీపీ ప్లీనరీకి సీఎం జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ హాజరవుతుండటంతో.. భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ అధికారులు. ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్కింగ్ కోసం 25 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ భద్రతా ఏర్పాట్లను సీపీ కాంతిరాణా టాటా పర్యవేక్షించారు. రెండు రోజులపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్లీనరీ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు.
ప్లీనరీకోసం 4 రకాల పాస్ లు..
వైసీపీ ప్లీనరీకోసం నాలుగు కేటగిరీల్లో పాసులు జారీ చేస్తున్నారు. డయాస్ పాస్, వీవీఐపీ పాస్, వీఐపీ పాస్, డిగ్నటరీస్ పాస్.. ఇలా వీటిని వర్గీకరించారు. వేదికపై ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉంటారు. వేదికపై 280 మందికి సీటింగ్ ఏర్పాట్లు చేశారు. వీరిలో మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలు మొదటి వరుసలో ఉంటారు. వీరికోసం డయాస్ పాస్ ఇస్తారు. వేదిక కింద మొదటి వరుసలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వైస్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు కూర్చుంటారు. మొదటి రోజు లక్ష మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. రెండో రోజు దాదాపు 4 లక్షలమంది వస్తారని అంచనా.
జగన్ ప్రసంగంపై ఆసక్తి..
వైసీపీ రెండో ప్లీనరీలో నవరత్నాల కార్యక్రమాలను ప్రకటించిన జగన్.. ఆ నవరత్నాల హామీతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు జరగబోయే ప్లీనరీలో కూడా జగన్ కీలక ప్రకటన చేస్తారని అంచనా. నేతలంతా దీనిపై ఇప్పటికే ప్రజల్ని ఊరిస్తున్నారు. 9వతేదీన జగన్ ప్రసంగం ఎవరూ మిస్ కావొద్దని చెబుతున్నారు. ఇక విజయసాయిరెడ్డి కూడా ప్లీనరీ తర్వాత చంద్రబాబు వెక్కి వెక్కి ఏడుస్తారని సెటైర్లు వేశారు. అంటే ప్లీనరీలో ఏదో కీలక విషయంపై జగన్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అదేంటనేది సస్పెన్స్ గా మారింది.