వాక్ స్వాతంత్య్రం: మోదీ సర్కార్ పై కోర్టుకెక్కిన ట్విట్టర్
ట్విట్టర్ లో తాము చెప్పిన కంటెంట్ ను, అకౌంట్లను తొలగించాలన్న మోదీ సర్కార్ ఆదేశాలకు వ్యతిరేకంగా ట్విట్టర్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం బ్లాక్ చేయాలని కోరిన కంటెంట్‌కు, ఐటీ చట్టంలోని సెక్షన్ 69–ఏకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్ పేర్కొంది.అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించిన ట్విట్టర్, రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల నుంచి పోస్ట్ చేసిన సమాచారాన్ని నిరోధించడం, వినియోగదారులకు ఇచ్చిన వాక్ స్వాతంత్య్రం హామీకి భంగం […]
ట్విట్టర్ లో తాము చెప్పిన కంటెంట్ ను, అకౌంట్లను తొలగించాలన్న మోదీ సర్కార్ ఆదేశాలకు వ్యతిరేకంగా ట్విట్టర్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం బ్లాక్ చేయాలని కోరిన కంటెంట్‌కు, ఐటీ చట్టంలోని సెక్షన్ 69–ఏకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ దాఖలు చేసిన పిటిషన్ పేర్కొంది.అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించిన ట్విట్టర్, రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల నుంచి పోస్ట్ చేసిన సమాచారాన్ని నిరోధించడం, వినియోగదారులకు ఇచ్చిన వాక్ స్వాతంత్య్రం హామీకి భంగం కలిగించడమేనని అభిప్రాయపడింది.
దేశంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం సమయంలో ట్విట్టర్ లోని కొన్ని అకౌంట్లు ప్రభుత్వంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాయని, COVID-19 మహమ్మారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా పలు ఖాతాలు ట్విట్టర్ లో విమర్షించాయని, వాటన్నింటినీ తొలగించాలని మోదీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వం చెబుతున్న వివాదాస్పద ఖాతాలపై న్యాయసమీక్ష జరపాలని ట్విట్టర్ కోర్టును కోరింది.
ట్విట్టర్ కోర్టును ఆశ్రయించిన అంశంపై భారతదేశ ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ ఎవరికైనా కోర్టుకు వెళ్ళే హక్కు ఉందన్నారు. అయితే ప్రతి ఒక్కరూ చట్టప్రకారం నడుచుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
కాగా జూలై 4వ తేదీలోగా తమ ఉత్తర్వులను అమలు చేయకుంటే చట్టపరమైన రక్షణలు రద్దవుతాయంటూ జూన్ 28వ తేదీన ట్విట్టర్‌కు ప్రభుత్వం హెచ్చరికలు పంపిన విషయం తెలిసిందే.