నాసిక్ జిల్లాలో ముస్లిం మతనాయకుడి హత్య
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ ముస్లిం ఆధ్యాత్మిక గురువు హత్య కలకలం రేపుతోంది. ముంబైకి 200కిలోమీటర్ల దూరంలో ఉన్న యెయోలా పట్టణంలోని ఎంఐడిసి ప్రాంతంలో మంగళవారం నాడు 35 ఏళ్ల ముస్లిం మత నాయకుడిని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఈ ఆధ్యాత్మిక గురువు హత్య వెనుక గల కారణాలు వెంటనే తెలియరాలేదు. మృతుడిని ఖ్వాజా సయ్యద్ చిస్తీగా గుర్తించామని, అతను యోలాలో ‘సూఫీ బాబా’గా ప్రసిద్ధి చెందాడని […]
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ ముస్లిం ఆధ్యాత్మిక గురువు హత్య కలకలం రేపుతోంది. ముంబైకి 200కిలోమీటర్ల దూరంలో ఉన్న యెయోలా పట్టణంలోని ఎంఐడిసి ప్రాంతంలో మంగళవారం నాడు 35 ఏళ్ల ముస్లిం మత నాయకుడిని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.
ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఈ ఆధ్యాత్మిక గురువు హత్య వెనుక గల కారణాలు వెంటనే తెలియరాలేదు. మృతుడిని ఖ్వాజా సయ్యద్ చిస్తీగా గుర్తించామని, అతను యోలాలో ‘సూఫీ బాబా’గా ప్రసిద్ధి చెందాడని చెప్పారు.
దుండగులు అతని నుదుటిపై తుపాకీతో కాల్చడంతో అతను అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ పౌరుడైన సూఫీ బాబాను హత్య చేసిన తర్వాత, దుండగులు అతను ఉపయోగించిన ఎస్‌యూవీ లోనే అక్కడి నుండి పారిపోయారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
వారిలో అంతర్గత కలహాల వల్ల కానీ ఆస్తుల విషయంగా కానీ ఈ హత్య జరిగిందా లేక ఇతరులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యోలా పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకూ నూపుర్ శర్మవ్యాఖ్యలను సమర్ధించారనే ఆరోపణలతో ఉదయ్‌పూర్ లో టైలర్ కన్హయ్యలాల్, మహారాష్ట్రలో ఓ వ్యక్తి హత్యకు గురవడంతో దేశంలో సంచలనమవుతున్న తరుణంలో ఇప్పుడు ముస్లిం మత నాయకుడి హత్య ఎటు దారి తీస్తుందోనని ఆ ప్రాంతంలో చర్చ జరుగుతోంది.