Telugu Global
National

కొవిడ్ సంపాదనే కొంప ముంచిందా..? డోలో కంపెనీపై ఐటీ రైడ్స్..

డోలో-650. కొవిడ్ సమయంలో పిప్పర్మెంట్లు నమిలేసినట్టు భారతీయులు డోలో ట్యాబ్లెట్లు నమిలేశారు. అప్పట్లో డోలోపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో జోకులు పేలాయి. భారతీయులు కొవిడ్ సమయంలో వాడిన డోలో ట్యాబ్లెట్లు ఓ వరుసలో పేరిస్తే చంద్రుడిపైకి రెండుసార్లు వెళ్లిరావొచ్చని కూడా లెక్కలు కట్టారు. ప్రపంచ దేశాలన్నీ కొవిడ్ తో అల్లాడిపోతుంటే భారతీయులు మాత్రం డోలో అడ్డుపెట్టి తమని తాము రక్షించుకున్నట్టు లెక్కలేనన్ని మీమ్స్ సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. జోకుల సంగతి పక్కనపెడితే సీరియస్‌గా కూడా […]

కొవిడ్ సంపాదనే కొంప ముంచిందా..? డోలో కంపెనీపై ఐటీ రైడ్స్..
X

డోలో-650. కొవిడ్ సమయంలో పిప్పర్మెంట్లు నమిలేసినట్టు భారతీయులు డోలో ట్యాబ్లెట్లు నమిలేశారు. అప్పట్లో డోలోపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో జోకులు పేలాయి. భారతీయులు కొవిడ్ సమయంలో వాడిన డోలో ట్యాబ్లెట్లు ఓ వరుసలో పేరిస్తే చంద్రుడిపైకి రెండుసార్లు వెళ్లిరావొచ్చని కూడా లెక్కలు కట్టారు. ప్రపంచ దేశాలన్నీ కొవిడ్ తో అల్లాడిపోతుంటే భారతీయులు మాత్రం డోలో అడ్డుపెట్టి తమని తాము రక్షించుకున్నట్టు లెక్కలేనన్ని మీమ్స్ సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.

జోకుల సంగతి పక్కనపెడితే సీరియస్‌గా కూడా డోలో-650 ట్యాబ్లెట్ల కంపెనీ కొవిడ్ సమయంలో భారీగా లాభాలను ఆర్జించింది. బెంగళూరుకి చెందిన మైక్రోల్యాబ్స్ సంస్థ డోలో ట్యాబ్లెట్ల తయారీదారు. కొవిడ్ సమయంలో దాదాపు 350కోట్ల ట్యాబ్లెట్లను ఈ సంస్థ విక్రయించినట్టు లెక్కలున్నాయి. కొవిడ్ పీక్ స్టేజ్ లో ఉన్న ఏడాదిలో ఏకంగా 400కోట్ల రూపాయలు ఆర్జించింది. ఈ లెక్కలే ఇప్పుడు ఆ సంస్థకు చికాకులు తెచ్చిపెట్టాయి, ఐటీ రైడ్స్ కి కారణం అయ్యాయి.

బెంగళూరులోని మైక్రో ల్యాబ్స్ కార్యాలయంలో బుధ‌వారం ఐటీ సోదాలు జరిగాయి. 20 మంది అధికారుల బృందం అకస్మాత్తుగా సోదాలకు రావడంతో మైక్రో ల్యాబ్స్ సిబ్బంది షాకయ్యారు. రేస్ కోర్స్ రోడ్ లోని కార్యాలయంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. కేవలం బెంగళూరులోనే కాకుండా.. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో మైక్రోల్యాబ్స్ కి ఉన్న 200 కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలిపారు ఐటీ అధికారులు. న్యూఢీల్లీ, సిక్కిం, పంజాబ్, తమిళనాడు, గోవా తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. మైక్రో ల్యాబ్స్ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా నివాసాల్లో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

కొవిడ్ సమయంలో పారాసెట్మాల్ ట్యాబ్లెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పారాసెట్మాల్ ఇతర రూపాల్లో ఉన్నా కూడా డోలో-650 డోసేజ్ కరెక్ట్ గా ఉండటంతో అందరు డాక్టర్లు ఆ ట్యాబ్లెట్స్ నే సిఫారసు చేశారు. ఇంకేముంది అందరూ డోలో వెంట పడ్డారు. దీంతో డోలోకి డిమాండ్ పెరిగింది, ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడిలా ఐటీరైడ్లకు కూడా అదే ప్రధాన కారణం అయి కూర్చుంది.

First Published:  6 July 2022 1:18 PM IST
Next Story