Telugu Global
NEWS

కాంగ్రెస్‌, కమలం మధ్య కండువా ఫైట్‌ ! బీజేపీలోకి రచనా రెడ్డి !

తెలంగాణలో ఇంటర్నల్‌ పాలిటిక్స్‌ వేడెక్కాయి. బీజేపీ సభలతో హడావుడి పెంచితే..కాంగ్రెస్‌ కండువాల మార్పిడితో దూకుడుగా వెళుతోంది. కండువాల మార్పిడిలో కమలం వెనుకపడింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ చేరికలపై ఫోకస్‌ పెట్టింది. తెలంగాణలో కమలం నేతల హడావుడి పెరిగింది. కానీ ఆ పార్టీ వైపు చూసే నేతలు కనపడడం లేదు. ఈటల రాజేందర్ తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి భారీగా వలసలు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ నాంపల్లి బీజేపీ ఆఫీస్‌ వైపు ఎవరూ అడుగులు వేయలేదు. జిట్టా […]

కాంగ్రెస్‌, కమలం మధ్య కండువా ఫైట్‌ ! బీజేపీలోకి రచనా రెడ్డి !
X

తెలంగాణలో ఇంటర్నల్‌ పాలిటిక్స్‌ వేడెక్కాయి. బీజేపీ సభలతో హడావుడి పెంచితే..కాంగ్రెస్‌ కండువాల మార్పిడితో దూకుడుగా వెళుతోంది. కండువాల మార్పిడిలో కమలం వెనుకపడింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ చేరికలపై ఫోకస్‌ పెట్టింది.

తెలంగాణలో కమలం నేతల హడావుడి పెరిగింది. కానీ ఆ పార్టీ వైపు చూసే నేతలు కనపడడం లేదు. ఈటల రాజేందర్ తర్వాత టీఆర్‌ఎస్‌ నుంచి భారీగా వలసలు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ నాంపల్లి బీజేపీ ఆఫీస్‌ వైపు ఎవరూ అడుగులు వేయలేదు. జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణిరుద్రమ లాంటి వారు పార్టీలో చేరారు. ఆ తర్వాత చాలా రోజుల మంతనాల తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీలోకి వచ్చారు. కానీ ఆ తర్వాత చేరే లిస్ట్‌ కనిపించడం లేదు.

కమలం పార్టీలో చేరికలు లేవని హైకమాండ్‌ దృష్టిలోకి వెళ్లింది. దీంతో ఈ విషయంలో నేతలకు క్లాస్ పీకారని సమాచారం. దీంతో వెంటనే ఈటల నేతృత్వంలో కమిటీ వేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా టీజేఎస్‌లో ఉన్న లాయర్ రచనా రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో మరికొంతమందిని పార్టీలోకి వెల్‌కమ్‌ పలికేందుకు రెడీ అవుతున్నారట.

ఇటు కాంగ్రెస్‌ మాత్రం చేరికలపై పుల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్యే బోడ జనార్దన్‌ పార్టీలోకి వచ్చారు. గ్రేటర్‌లో పీజేఆర్‌ కూతురు విజయారెడ్డికి కండువా కప్పారు. బడంగ్‌పేట్‌ మేయర్‌ను తిరిగి పార్టీలోకి చేర్చారు. దీంతోపాటు హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డితో పాటు వర్ధన్నపేట నియోజకవర్గ నేత శ్రీధర్‌కి కూడా కండువా మార్పిడి చేయబోతున్నారు. ఇలా చేరికలతో జోష్‌ పెంచే ప్రయత్నంలో రేవంత్‌ ఉంటే.. సీనియర్‌ నేతలు మాత్రం కొందరు ఆయన దూకుడుకు బ్రేక్‌లు వేసే ప్రయత్నం చేశారు. దీంతో ఢిల్లీలో భట్టి, రేవంత్‌ మధ్య ఈవిషయంలో పంచాయితీ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలకు కేసీ వేణుగోపాల్‌ సర్దిచెప్పినట్లు సమాచారం. మొత్తానికి రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య కండువా ఫైట్‌ నడిచే అవకాశం కన్పిస్తోంది.

First Published:  6 July 2022 2:33 AM IST
Next Story