Telugu Global
MOVIE UPDATES

కీరవాణి డోస్ అదిరిపోయిందిగా

మనకు నచ్చని వ్యక్తులు రామ్ అన్నా అది బూతుగానే ధ్వనిస్తుంది.. ఎక్కడో ఒక చోట వాళ్ళని మొత్తాలనిపిస్తుంది. కానీ కలం మన చేత ఉందికదా అని ఇష్టమొచ్చినట్టు రాస్తే మాత్రం అది కంపు కాక మరేమవుతుంది. సంగీత ప్రపపంచంలో తనకు తాను సుస్థిర స్థానమేర్పరచుకున్న ఓ ప్రముఖ సంగీత దర్శకుడు సెటైరిక్ గా చేసిన ఓ వ్యాఖ్యను కూడా వక్రీకరిస్తే అది వక్రబుద్ధినే సూచిస్తుంది. దేశ విదేశాల్లో చిన్నా, పెద్దా అందరి చేతా శభాష్ అనిపించుకున్న రాజమౌళి […]

mm keeravani
X

మనకు నచ్చని వ్యక్తులు రామ్ అన్నా అది బూతుగానే ధ్వనిస్తుంది.. ఎక్కడో ఒక చోట వాళ్ళని మొత్తాలనిపిస్తుంది. కానీ కలం మన చేత ఉందికదా అని ఇష్టమొచ్చినట్టు రాస్తే మాత్రం అది కంపు కాక మరేమవుతుంది.

సంగీత ప్రపపంచంలో తనకు తాను సుస్థిర స్థానమేర్పరచుకున్న ఓ ప్రముఖ సంగీత దర్శకుడు సెటైరిక్ గా చేసిన ఓ వ్యాఖ్యను కూడా వక్రీకరిస్తే అది వక్రబుద్ధినే సూచిస్తుంది. దేశ విదేశాల్లో చిన్నా, పెద్దా అందరి చేతా శభాష్ అనిపించుకున్న రాజమౌళి సినిమా ఆర్ ఆర్ ఆర్ మీద ఆస్కార్ విజేత.. సౌండ్ ఇంజనీర్ రసూల్ పోకుట్టి ఇది ‘గే లవ్ స్టోరీ’ అని వ్యాఖ్యానిస్తే సహజంగానే ఆగ్రహంతో ఈ మూవీ అభిమానులంతా ఆగ్రహంతో రెచ్చిపోయారు.

వాళ్ళ కోపాన్ని అదుపు చేసేందుకా అన్నట్టు ఇది తాను అంటున్న మాట కాదని, వెస్ట్ లో అంటే విదేశాల్లో ఎవరో చేసిన వ్యాఖ్య అని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. కానీ ఈ చిచ్చు ఇక్కడితో ఆగలేదు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా రంగంలోకి దిగి ట్విటర్ లో ..పోకుట్టి మీద కాస్థ వల్గర్ గానే స్పందించారు.

పోకుట్టిని కావాలనే..’ p+okutty’ అని పేర్కొన్నారు. బహుశా అక్షరాలు టైప్ చేసేటప్పుడు పైనా, కిందా తాను లెటర్స్ వాడి ఉండవచ్చునని, కానీ ఒకరి భావ ప్రకటనా స్వేచ్ఛను తాను గౌరవిస్తానని ఆయన అన్నారు.

ఇందులో మీరూ ఉన్నారు అని పోకుట్టిని ఉద్దేశించి స్పష్టం చేశారు. ఏమైనా తెలుగు భాష మీద పట్టు ఉన్నవారు చివరలో ‘డాట్స్’ని కనెక్ట్ చేసినప్పుడు ఇది ఆ సౌండ్ ఇంజనీర్ పట్ల బూతుగానే స్పందించారనిపిస్తుంది.

సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. కానీ కీరవాణిని పెద్దగా ఎవరూ విమర్శించలేదు. ఆర్ ఆర్ ఆర్ పై రసూల్ చేసిన వ్యాఖ్యలకు ఇది సరైన సమాధానమేనని అంటున్నారు. ఏమైతేనేం ? ఇది సోషల్ మీడియాలో హాట్ హాట్ గా నడుస్తోంది.

First Published:  6 July 2022 4:46 PM IST
Next Story