Telugu Global
International

బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి ముప్పు.. ఇద్దరు మంత్రుల రాజీనామా

బ్రిటన్ లో ప్రధాని బోరిస్ ప్రభుత్వానికి ముప్పు ముంచుకొచ్చింది. ఆర్ధిక మంత్రి రిషి సూనక్, ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావీద్ రాజీనామా చేశారు. జాన్సన్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సూనక్ రాజీనామా చేయగా దేశానికి ఇప్పుడు బలమైన కన్సర్వేటివ్ పార్టీ ఆవశ్యకత ఉందంటూ జావిద్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. ఒకేసారి ఇద్దరు మంత్రుల రాజీనామాలతో జాన్సన్ ప్రభుత్వం పెద్ద గండంలో పడింది. సూనక్ స్థానే కొత్త ఆర్థిక మంత్రిగా విద్యా శాఖ మంత్రి నదీమ్ జహావీని […]

Boris Johnson
X

బ్రిటన్ లో ప్రధాని బోరిస్ ప్రభుత్వానికి ముప్పు ముంచుకొచ్చింది. ఆర్ధిక మంత్రి రిషి సూనక్, ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావీద్ రాజీనామా చేశారు. జాన్సన్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సూనక్ రాజీనామా చేయగా దేశానికి ఇప్పుడు బలమైన కన్సర్వేటివ్ పార్టీ ఆవశ్యకత ఉందంటూ జావిద్ కూడా పదవి నుంచి తప్పుకున్నారు.

ఒకేసారి ఇద్దరు మంత్రుల రాజీనామాలతో జాన్సన్ ప్రభుత్వం పెద్ద గండంలో పడింది. సూనక్ స్థానే కొత్త ఆర్థిక మంత్రిగా విద్యా శాఖ మంత్రి నదీమ్ జహావీని జాన్సన్ నియమించారు. ఈ నియామకాన్ని రాణి ఎలిజిబెత్-2 ఆమోదించారు. ఇప్పటికే తన మంత్రుల్లోఒకరు లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం, మరికొన్ని స్కాములతో తలబొప్పికట్టిన బోరిస్ జాన్సన్ ని ఇది మరింత చిక్కుల్లో నెట్టింది.

ప్రభుత్వం నుంచి వైదొలగడం తనకు విచారకరమే అయినా ఈ తీరున మనం అధికారంలో కొనసాగలేమని తాను భావించానని సూనక్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బహుశా ఇది తన చివరి మంత్రి పదవి అని అనుకుంటున్నానని, కానీ ప్రజలు నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని ఆశిస్తారని ఆయన అన్నారు. అందువల్లే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు,.

ఇక సాజిద్ జావీద్ కూడా ఇప్పటివరకు తనీ పదవిని నిర్వహించానని, ఇది తనకు దక్కిన ప్రివిలేజ్ అని అన్నారు. ఇక మనస్సాక్షిగా ఈ పదవిలో కొనసాగలేనని భావిస్తున్నా అని ఈ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. ఇంకా ఆయన బ్రెగ్జిట్ సంక్షోభాన్ని కూడా తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు. మన దేశంలో ప్రాంతీయ అసమానతలను మీరు (ప్రధాని) లైట్ గా తీసుకున్నారని, మన పాలిటిక్స్ ని నిర్దేశించే ఈ సమస్య పట్ల నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు.

దేశానికిప్పుడు బలమైన కన్సర్వేటివ్ పార్టీ అవసరమని భావిస్తున్నానన్నారు. వ్యక్తి కన్నా పార్టీ పెద్దదన్న విషయాన్నీ మరువరాదన్నారు. నిజానికి ముఖ్యంగా సూనక్ కొంతకాలంగా జాన్సన్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తన సూచనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పరోక్షంగా పేర్కొంటూ వచ్చారు. లోగడ జాన్సన్ ప్రభుత్వంలో ఓ మంత్రి సెక్స్ స్కాండల్ లో చిక్కుకుని రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

First Published:  6 July 2022 12:15 PM IST
Next Story