టీడీపీ ప్రచారంలో సరికొత్త వ్యూహం !
ఎన్నికల రాజకీయాల్లో సినిమాల పాత్ర గణనీయమైనదే. ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశానికి మరింత స్ఫూర్తి కలిగించినవి అప్పట్లో ఆయన నటించిన సినిమాలే. ఆ ఉత్సాహంతోనే తెలుగుదేశం పార్టీ స్థాపించారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తిగానే కాక ఆ పార్టీకి తెలుగు సినిమా రంగం ఆసరాగా ఉంటూనే ఉంది. చంద్రబాబు హయాంలో కూడా పార్టీకి సినిమా రంగం అండదండలు అందించింది. తెర వెనక ఆ పార్టీకి ప్రచార ప్రకటనలు రూపొందించడం, వీడియోలు తయారు చేయడం వంటవి జరిగేవి. […]
ఎన్నికల రాజకీయాల్లో సినిమాల పాత్ర గణనీయమైనదే. ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశానికి మరింత స్ఫూర్తి కలిగించినవి అప్పట్లో ఆయన నటించిన సినిమాలే. ఆ ఉత్సాహంతోనే తెలుగుదేశం పార్టీ స్థాపించారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తిగానే కాక ఆ పార్టీకి తెలుగు సినిమా రంగం ఆసరాగా ఉంటూనే ఉంది. చంద్రబాబు హయాంలో కూడా పార్టీకి సినిమా రంగం అండదండలు అందించింది. తెర వెనక ఆ పార్టీకి ప్రచార ప్రకటనలు రూపొందించడం, వీడియోలు తయారు చేయడం వంటవి జరిగేవి.
ఇందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గరుండి అన్నీ చూసుకునేవారు. ఆయన మరోసారి పెద్ద ఎత్తున టీడీపీ ప్రచార బాధ్యతను తీసుకోబోతున్నారట. ఆయన టీడీపీ కోసం ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ప్రజల్లోకి మరింతగా చొచ్చుకు వెళ్ళేందుకు సరికొత్త ప్రచార వ్యూహాలను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా మాద్యమం ద్వారా ప్రజలకు చేరువ కావాలని భావిస్తున్నారట. ఇందుకు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు నడుం బిగించి పరుచూరి బ్రదర్స్ తో కథ, కథనాలు సిద్ధం చేయించారని వినికిడి.
తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలోని విజయాలు, అభివృద్ది, చంద్రబాబు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలుగు రాష్ట్రాలకు కలిగిన సానుకూల ప్రయోజనాలు వంటి అంశాలు ఈ సినిమా కథ లోఉంటాయని సమాచారం. అలాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పాలనా తీరు తెన్నులు, సంక్షేమ పథకాల పేరుతో పంపకాలు, ముఖ్యమంత్రి తీరుతో రాష్ట్రానికి జరుగుతున్న నష్టాలు, కోలుకోలేని అప్పులు తదితర అంశాలను ఈ సినిమాలో రాఘవేంద్ర రావు చూపించబోతున్నారని తెలుస్తోంది.
ఇక తారాగణం గురించి సుదీర్ఘమైన చర్చ సాగుతోంది. చిన్నా చితకా నటీనటులతో సినిమా చేస్తే జనంలోకి బాగా వెళ్ళకపోవచ్చని ఆలోచిస్తున్నారట. అయితే ప్రస్తుతం హీరోలంతా పాన్ ఇండియా మోజులో ఉంటుంటే ఈ రాజకీయ కోణం ఉన్న సినిమాలో నటించేందుకు ధైర్యం చేస్తారా అనే ప్రశ్న కూడా వస్తోంది.
అందుకే ఇతర భాషానటుల పేర్లను పరిశీలిస్తున్నారు. దర్శకుడిగా రాఘవేంద్ర రావు కాబట్టి నటించేందుకు వారు అంగీకరించవచ్చని భావిస్తున్నారు. హీరో నోటి వెంట శక్తిమంతమైన డైలాగులు రావాలి కాబట్టి ఆ మాత్రం వెయిట్ ఉన్న నటుణ్ణే ఎంపిక చేస్తారనుకుంటున్నారు. ఇప్పటికే కథ, కథనాలు సిద్ధం అయ్యాయి కాబట్టి ఎన్నికల లోపు ఈ చిత్రాన్ని పూర్తి చేసి ప్రజల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.