Telugu Global
NEWS

తెలంగాణాను చేజిక్కించుకోవడానికి యుద్దం….నలుగురు కేంద్రమంత్రులను దింపుతున్న‌ బీజేపీ

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ రోజుకో ఎత్తుగడ వేస్తోంది. ఆ పార్టీకి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మతపరమైన విషయాలపైనే కేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మతపరమైన చీలికను తీసుకొచ్చి ఎన్నికల్లో లాభపడాలని సీరియస్ గానే ప్రయత్నిస్తోంది. నిన్న గాక మొన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేసి అగ్రనేతలంతా హైదరాబాద్ లో వాలిపోయారు. కొందరు నాయకులు జిల్లాలు కూడా పర్యటించారు. వాళ్ళు ఊహించినంత జనసమీకరణ […]

తెలంగాణాను చేజిక్కించుకోవడానికి యుద్దం….నలుగురు కేంద్రమంత్రులను దింపుతున్న‌ బీజేపీ
X

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ రోజుకో ఎత్తుగడ వేస్తోంది. ఆ పార్టీకి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మతపరమైన విషయాలపైనే కేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మతపరమైన చీలికను తీసుకొచ్చి ఎన్నికల్లో లాభపడాలని సీరియస్ గానే ప్రయత్నిస్తోంది. నిన్న గాక మొన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేసి అగ్రనేతలంతా హైదరాబాద్ లో వాలిపోయారు. కొందరు నాయకులు జిల్లాలు కూడా పర్యటించారు. వాళ్ళు ఊహించినంత జనసమీకరణ జరగకపోయినా బహిరంగ సభ ఏర్పాటు చేసి బలం చాటుకోవాలని తాపత్రయపడ్డారు.

ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసి తెలంగాణకు కేంద్ర మంత్రులను దించబోతున్నారు. తెలంగాణను హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్‌, జ‌హీరాబాద్ ల పేరుతో నాలుగు భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి ఒక్కో కేంద్రమంత్రిని ఇంచార్జ్ గా నియమించారు.

హైద‌రాబాద్ ఏరియాకు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా, జ‌హీరాబాద్ ఏరియా బాధ్య‌త‌ల‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్, ఆదిలాబాద్ ప్రాంతానికి కేంద్ర మంత్రి పురుషోత్త‌మ్ రూపా, వ‌రంగ‌ల్ ఏరియాకు రావు ఇంద్ర‌జిత్ సింగ్‌ను ఇంచార్జ్ లుగా నియ‌మించింది బీజేపీ అధిష్టానం.

రాబోయే ఎన్నికల్లో ఈ ఇంచార్జీలే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అభ్యర్థుల ఎంపిక, పార్టీ టికెట్ల కేటాయింపు, అభ్య‌ర్థుల ప్ర‌చారం, బూత్ క‌మిటీల‌ను బ‌లోపేతం చేయ‌డం త‌దిత‌ర అన్ని అంశాల‌ను ఈ ఇంచార్జీలే స్వయంగా ప‌రిశీలించ‌నున్నారు.

మరి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేయడానికి ఏం పనులు మిగిలున్నాయని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. స్థానిక నాయకుల మీద నమ్మకం లేకనే బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీ నుంచి నాయకులను దింపుతున్నదా అనే ప్రశ్నలు కూడా ప్రారంభమయ్యాయి.

కాగా బెంగాల్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే విధంగా కేంద్రం నుంచి నాయకులను దింపి అక్కడ యుద్ద వాతావరణాన్ని సృష్టించిన విషయం మర్చిపోలేం. అక్కడ బీజేపీ చేసిన హడావుడి చూసి బెంగాల్ లో బీజేపీ గెలవబోతోందని అప్పుడు అందరూ అనుకున్నారు. కానీ చివరకు ఎన్నికల్లో మమతా బెనర్జీ చేతిలో చావుదెబ్బ తిని కళ్ళు తేలేసింది బీజేపీ. ఆ తర్వాత బీజేపీ తరపున యుద్దం చేసిన ముఖ్యనేతలంతా టీఎంసీలో చేరిపోయారు.

First Published:  5 July 2022 11:41 AM IST
Next Story