కేసీఆర్ – ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్
కేసీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. కానీ ఆయనలోని మరిన్ని కోణాలను తన పుస్తకంలో ఆవిష్కరించానని చెబుతున్నారు రచయిత మనోహర్ చిమ్మని. 'కేసీఆర్ – ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్' పేరిట ఆయన రాసిన పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు. ట్విట్టర్లో రివ్యూ రాస్తా.. మనోహర్ […]
కేసీఆర్ జీవితం తెరిచిన పుస్తకం. కానీ ఆయనలోని మరిన్ని కోణాలను తన పుస్తకంలో ఆవిష్కరించానని చెబుతున్నారు రచయిత మనోహర్ చిమ్మని. 'కేసీఆర్ – ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్' పేరిట ఆయన రాసిన పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు.
ట్విట్టర్లో రివ్యూ రాస్తా..
మనోహర్ రాసిన ఈ పుస్తకాన్ని తాను పూర్తిగా చదివి అప్పుడు ట్విట్టర్లో రివ్యూ పెడతానని చెప్పారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని చెప్పారాయన. 60 ఏళ్లపాటు ఎవరూ సాధించని తెలంగాణను కేసీఆర్ సాధించి చూపించారన్నారు. తెలంగాణ సాధనకోసం ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ ఢిల్లీలో ప్రతిఒక్కరిని కలుపుకొనిపోయారని గుర్తుచేశారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో ప్రణాళికలు రచించి, తన శక్తియుక్తులన్నీ ధారపోశారని గుర్తుచేశారు కేటీఆర్. చివరికి ఆమరణ నిరాహారదీక్ష కూడా చేశారని, అందరూ రాదు రాదు అన్న తెలంగాణను తెచ్చి చూపించారని చెప్పారు.
ముఖ్యమంత్రిగా ఎన్నో విజయాలు..
ఉద్యమ నేతగా తెలంగాణ సాధించి చూపించిన కేసీఆర్, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధిబాట పట్టించారని చెప్పారు కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను రికార్డ్ టైంలో నిర్మించారని, దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్-1గా నిలిపారని తెలిపారు. ఇంత చేస్తున్నా కేసీఆర్ పై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో మనోహర్ చిమ్మని లాంటి రచయిత శ్రమించి కేసీఆర్ మీద ఒక మంచి పుస్తకం తీసుకురావడం నిజంగా హర్షణీయం అని అభినందించారు కేటీఆర్.
రచయిత గురించి..
మనోహర్ చిమ్మని ముందుగా కేసీఆర్ వీరాభిమాని. సినీ రచయితగా తన సత్తా చూపించిన మనోహర్, స్విమ్మింగ్ పూల్ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. నంది అవార్డు గ్రహీత అయిన ఆయన కేసీఆర్ రాజకీయ ప్రస్థానంపై ఈ పుస్తకాన్ని రచించారు.