Telugu Global
NEWS

మీ పీసీలు, ల్యాప్‌టాప్‌లు జర భద్రం.. భయపెడుతున్న ‘విండోస్ వార్మ్’

పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడే వారు ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘విండోస్ వార్మ్‘ ఈ మధ్య నెట్‌వర్క్ లోకి చొరబడి.. కంప్యూటర్లను హ్యాక్ చేస్తోందని, డేటాను పూర్తిగా నాశనం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది. కంపెనీ సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ ఈ మాల్‌వేర్‌ను గుర్తించడమే కాకుండా దీనికి రాస్బెరీ రాబిన్ అని పేరు పెట్టింది. 2021లో రెడ్ కానరీ తొలి సారిగా ఈ రాస్బెరీ రాబిన్‌ను గుర్తించారు. ఇది ఇంటర్ నెట్ ద్వారానే […]

మీ పీసీలు, ల్యాప్‌టాప్‌లు జర భద్రం.. భయపెడుతున్న ‘విండోస్ వార్మ్’
X

పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడే వారు ఇప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘విండోస్ వార్మ్‘ ఈ మధ్య నెట్‌వర్క్ లోకి చొరబడి.. కంప్యూటర్లను హ్యాక్ చేస్తోందని, డేటాను పూర్తిగా నాశనం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్నది. కంపెనీ సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ ఈ మాల్‌వేర్‌ను గుర్తించడమే కాకుండా దీనికి రాస్బెరీ రాబిన్ అని పేరు పెట్టింది.

2021లో రెడ్ కానరీ తొలి సారిగా ఈ రాస్బెరీ రాబిన్‌ను గుర్తించారు. ఇది ఇంటర్ నెట్ ద్వారానే కాకుండా యూఎస్‌బీ డ్రైవ్‌ల నుంచి కూడా ప్రవేశిస్తున్నట్లు తెలిపారు. ఈ వార్మ్ malicious.LINK అనే ఫైల్ ద్వారా కొత్త పీసీలు, ల్యాప్‌టాప్‌లలోకి చొరబడుతున్నది. ఆ తర్వాత ఆ కంపెనీ నెట్‌వర్క్ ద్వారా అన్ని డివైజ్‌లోకి వ్యాపిస్తోంది. ఒక సర్వర్ కింద కనెక్ట్ అయి ఉన్న అన్ని డివైజ్‌ల దీని బారిన పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

వైరస్‌, వార్మ్ మధ్య తేడా ఏంటి?
సాధారణంగా మన ఫోన్లు, ట్యాబ్‌లు, పీసీలు, ల్యాప్‌టాప్‌లలో ప్రవేశించే మాల్ వేర్‌ను వైరస్, ట్రోజాన్, వార్మ్స్, యాడ్‌వేర్, స్పై వేర్‌ అని పిలుస్తుంటారు. అయితే వైరస్, వార్మ్ మధ్య చాలా తేడా ఉన్నది. వైరస్ అనేది ఏ కంప్యూటర్ నెట్‌వర్క్ లోకి ప్రవేశించినా.. అది స్ప్రెడ్ కావడానికి ఒక హోస్ట్‌ను ఉపయోగించుకుంటుంది. హోస్ట్ లేకపోతే అది వ్యాపించదు. అంతే కాకుండా అది పీసీ, ట్యాప్, ల్యాప్‌టాప్‌లోకి డాక్యుమెంట్, ఎగ్జిక్యూటీవ్ ఫైల్, మీడియా ఫైల్ రూపంలో నిక్షిప్తం అయి ఉంటుంది. ఆ డివైజ్‌ను వాడేవాళ్లు సదరు ఫైల్‌పై క్లిక్ చేస్తే తప్ప వైరస్ యాక్టివేట్ కాదు. అంటే మన డివైజ్‌లలోకి వైరస్ ఫైల్ ప్రవేశించినా.. మనం దానిపై క్లిక్ చేయనంత వరకు ప్రమాదం ఏమీ ఉండదు. వేరే డివైజ్‌లలోకి కూడా వెళ్లదు.

వార్మ్ మాత్రం అలా కాదు. దానికి హోస్ట్ అవసరమే ఉండదు. ఒక సారి డివైజ్‌లోకి ప్రవేశించిన తర్వాత యూజర్ యాక్టివేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది మన ఫోన్, పీసీ, ల్యాపీలలోకి ప్రవేశించి తన పని తాను చేసుకొని పోతుంది. మన డేటాను నాశనం చేయడం, డివైజ్‌ను పని చేయకుండా ఆపేస్తుంది. దానంతట అదే మన ఈమెయిల్ ఐడీలు, కాంటాక్ట్ నెంబర్లు, ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్ ద్వారా ఇతరులకు.. అక్కడి నుంచి వేరే డివైజ్‌లలోకి అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. సరైన భద్రత, యాంటీ వార్మ్ సాఫ్ట్‌వేర్స్ లేకపోతే మన డివైజ్‌లపై ఆశలు వదులుకోవల్సిందే. అందుకే వైరస్ కంటే వార్మ్ అత్యంత ప్రమాదకారి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

First Published:  5 July 2022 1:29 PM IST
Next Story