Telugu Global
National

చీలిక దిశగా మహారాష్ట్ర కాంగ్రెస్ ..?

మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. షిండే నేతృత్వంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన సంద‌ర్భంలోనే కాంగ్రెస్ లో చీలిక వ‌స్తోంద‌న్న వార్త‌లు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. సోమ‌వారంనాడు అసెంబ్లీలో జరిగిన షిండే విశ్వాస ప‌రీక్షకు మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ చ‌వాన్ స‌హా 11 మంది ఎమ్మెల్యేలు హాజ‌రుకాక‌పోవ‌డంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది. అశోక్ చ‌వాన్‌, అజ‌య్ వాదెట్టివ‌ర్‌, ధీర‌జ్ దేశ్ ముఖ్‌, ప్ర‌ణీతి షిండే, హజితేఫ్ అంత్ పుర్క‌ర్‌, జిషాన్ సిద్ధిఖీ, రాజె అవాలే, […]

చీలిక దిశగా మహారాష్ట్ర కాంగ్రెస్ ..?
X

మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. షిండే నేతృత్వంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన సంద‌ర్భంలోనే కాంగ్రెస్ లో చీలిక వ‌స్తోంద‌న్న వార్త‌లు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. సోమ‌వారంనాడు అసెంబ్లీలో జరిగిన షిండే విశ్వాస ప‌రీక్షకు మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ చ‌వాన్ స‌హా 11 మంది ఎమ్మెల్యేలు హాజ‌రుకాక‌పోవ‌డంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరుతోంది.

అశోక్ చ‌వాన్‌, అజ‌య్ వాదెట్టివ‌ర్‌, ధీర‌జ్ దేశ్ ముఖ్‌, ప్ర‌ణీతి షిండే, హజితేఫ్ అంత్ పుర్క‌ర్‌, జిషాన్ సిద్ధిఖీ, రాజె అవాలే, మోహ‌న్ అంబార్డే, కునాల్ పాటిల్‌, మాధ‌వ‌రావ్ జువాల్గోంక‌ర్‌, శిరీష్ ఛౌద‌రి ఫ్లోర్ టెస్ట్ 11 గంట‌ల‌కు జ‌రుగుతుంద‌న‌గా మిగిలిన స‌భ్యుల‌తో పాటు స‌మ‌యానికి రాలేదు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఫ్లోర్ టెస్ట్ కు గైర్హాజ‌ర‌వ‌డాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియ‌స్ గా తీసుకుని ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి హెచ్ కె పాటిల్ త‌ల అంటింది.

దీనిపై అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు అస్లాం షేక్‌, అమిన్ ప‌టేల్‌, సునిల్ కేదార్ తో పాటిల్ మాట్లాడారు. ముంబైలో వ‌ర్షాలు కార‌ణంగా ట్రిఫిక్ జాం లో చిక్కుకు పోవ‌డంతోనే స‌మాయానికి హాజ‌రుకాలేక‌పోయామ‌ని, కావాల‌ని జ‌రిగింది కాద‌ని చ‌వాన్ చెప్పారు. తాను, అజ‌య్ వాదెట్టివార్ అసెంబ్లీ చేరుకునే స‌మ‌యానికి లోప‌లికి వెళ్ళ‌ కుండా అసెంబ్లీ స్పీక‌ర్ ఆదేశాల‌తో గేట్లు మూసేశార‌ని చెప్పారు.

ఇదే సంద‌ర్భంలో మ‌హా వికాస్ అఘాడి కూట‌మి నుంచి కూడా కాంగ్రెస్ విడిపోతుంద‌నే వార్త‌లు వెలువ‌డ్డాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి పాటిల్ మాట్లాడుతూ.. ఎంవిఎ నుంచి కాంగ్రెస్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విడిపోద‌ని త‌మ కూట‌మి య‌థాత‌ధంగా కొన‌సాగుతుంద‌ని చెప్పారు. తాము శివ‌సేన‌తోనే ఉంటామ‌న్నారు. ఇవ‌న్నీ బిజెపి చేస్తున్న ప్ర‌చారం మాత్ర‌మేన‌ని అన్నారు. అయినా బిజెపి రాష్ట్రంలో చేస్తున్న రాజ‌కీయాల నేప‌ద్యంలో కాంగ్రెస్ లో చీలిక రాదంటే న‌మ్మే ప‌రిస్థితులు లేవంటున్నారు.

బిజెపి గాలం వేసింది నిజ‌మే !
షిండే విశ్వాస‌ప‌రీక్ష‌ను ఎదుర్కొంటున్న త‌రుణంలోనే బిజెపి త‌మ ఎమ్మెల్యేల‌కు గాలం వేసింద‌ని కొంద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పారు. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను కూడా బిజెపి గుర్తించింద‌ని, చీలిపోవ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని కూడా చెప్పిన‌ట్టు తెలిసింద‌ని ఒక సీనియ‌ర్ నాయ‌కుడు చెప్పారు. అంతేగాక ఉప ఎన్నిక‌లు వ‌స్తే వారిని గెలిపించుకునే బాధ్య‌త కూడా త‌మ‌దేన‌ని బిజెపి వాగ్దానం చేసింద‌న్నారు.

కాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్ధి ఓడిపోయిన త‌ర్వాత కాంగ్రెస్ జాగ్ర‌త్త ప‌డుతోంది. వ‌ర‌స స‌మావేశాలు నిర్వ‌హిస్తూ పార్టీ కి చెందిన 44 ఎమ్మెల్యేలు క‌లిసి ఉండేలా, చేజారి పోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త్తలు తీసుకుంటోంది. కానీ బిజెపి ఆప‌రేష‌న్ క‌మ‌లం ప్రారంభ‌మ‌య్యాక దాని ప్ర‌య‌త్నాలు ఆప‌కుండా ముందుకు సాగిస్తే మాత్రం కాంగ్రెస్ లో చీలిక రావ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదంటున్నారు విశ్లేష‌కులు.

First Published:  5 July 2022 6:56 AM IST
Next Story