ముస్లిం పాత్రలున్నాయని నాటక ప్రదర్శనపై దాడి
కర్ణాటకలో హిందుత్వ ఉన్మాదం పరాకాష్టకు చేరుకుంటోంది. అసహనం పెచ్చుమీరి పోతోందనడానికి ఇటీవల జరిగిన హిజాబ్ వివాదం, పాఠ్యాంశాల్లో మతసంబంధిత విషయాలను చేర్చడం వంటి సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఆఖరికి సాంస్కృతిక, కళా రూపాల్లో కూడా పరమత సహనాన్ని భరించలేని పరిస్థితికి చేరుకుంటోంది. కర్ణాటకలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ నాటకాన్ని బజరంగ దళ్ సభ్యులు మధ్యలోనే నిలిపివేశారు. నాటకం ప్రారంభమైన కొద్ది సేపటికే బజరంగ దళ్ సభ్యులు పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ ప్రదర్శన హాలులోకి వచ్చారు. […]
కర్ణాటకలో హిందుత్వ ఉన్మాదం పరాకాష్టకు చేరుకుంటోంది. అసహనం పెచ్చుమీరి పోతోందనడానికి ఇటీవల జరిగిన హిజాబ్ వివాదం, పాఠ్యాంశాల్లో మతసంబంధిత విషయాలను చేర్చడం వంటి సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఆఖరికి సాంస్కృతిక, కళా రూపాల్లో కూడా పరమత సహనాన్ని భరించలేని పరిస్థితికి చేరుకుంటోంది. కర్ణాటకలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ నాటకాన్ని బజరంగ దళ్ సభ్యులు మధ్యలోనే నిలిపివేశారు. నాటకం ప్రారంభమైన కొద్ది సేపటికే బజరంగ దళ్ సభ్యులు పెద్దపెద్దగా నినాదాలు చేస్తూ ప్రదర్శన హాలులోకి వచ్చారు. నాటకాన్ని వెంటనే నిలిపి వేయాలంటూ కేకలు వేశారు.
ఇంతకీ ఆ నాటకంలో ముస్లిం పాత్రలు ఉండడమే వారి ఆగ్రహానికి కారణమైంది. శివమొగ్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 3న, బజరంగ్ దళ్ బృందం కన్నడ నాటకాన్ని ప్రదర్శిస్తున్న హాలులోకి దూసుకెళ్లి ప్రేక్షకులను వెళ్లిపోవాలని కోరింది. ప్రసిద్ధ రచయిత, గేయ రచయిత జయంత్ కైకిణి రచించిన 'జతగిరువాన చండీర' అనే నాటకాన్నిశివమొగ్గలోని రంగబెళకు అనే థియేటర్ గ్రూప్ ప్రదర్శిస్తోంది. శివమొగ్గ జిల్లా సొరబ్ తాలూకాలోని అనవట్టిలోని వీరశైవ మందిరంలో ఈ నాటకం జరుగుతోంది. ఒక్కసారిగా ఆందోళనకారులు దూసుకువచ్చి హంగామా సృష్టించడంతో నిర్వాహకులు, కళాకారులు బెదిరిపోయారు. వారి ఆగడాలకు నాటకాన్ని ఆపేయక తప్పలేదు.
జోసెఫ్ స్టెయిన్ చించిన ' ఫిడ్లర్ ఆన్ ది రూఫ్ ' కు కన్నడ అనుసరణ ఈ నాటకం. ముస్లిం పాత్రలతో నాటకాన్ని ప్రదర్శించడంపై ఆందోళనకారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆనవట్టి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బజరంగ్‌దళ్ కార్యకర్త శ్రీధర్ ఆచార్, మరికొంత మంది నాటకాన్ని ఆపేశారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే నాటకం ఆగిపోయింది. నాటకం ఆగిపోవడానికి గల కారణాలపై పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు.
కథ ఏమిటి..?
1905లో సామ్రాజ్యవాద రష్యాలోని పరిస్థితుల చుట్టూ జోసెఫ్ స్టియిన్ అల్లుకున్న కథ ఫిడ్లర్ ఆన్ ది రూఫ్. అనాటేవ్కా గ్రామంలో పాల వ్యాపారి అయిన టెవీ కుటుంబం చుట్టూ కథ తిరుగుతుంది. అతను తన యూదు మత సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగిస్తుంటాడు. అయితే బయటినుంచి అనేక శక్తులు వారి జీవితాలపై దాడి చేస్తాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే తన ముగ్గురు పెద్ద కుమార్తెల ధృడ సంకల్పం సహించలేని బయటి శక్తులు అతని కుటుంబంపై దాడి చేస్తాయి. ఇవన్నీ టెవీకి చాలా బాధ కలిగిస్తాయి. చివరికి జార్ శాసనం వారిని (యూదులు) గ్రామం నుంచి తరిమివేస్తుంది. స్థూలంగా ఇలా ఉన్న కథను జయంత్ కైకిణి నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మలుచుకుంటూ ఈ నాటకాన్ని రూపొందించారు.