అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం.. జగన్‌ను తప్పుపట్టాల్సింది ఏముంది?
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించారు. ప్రధాని మోడీ సోమవారం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆసాంతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా జి. కిషన్ రెడ్డే అన్నింటినీ దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డే అందరినీ ఆహ్వానించారు. అసలు ఎవరిని పిలవాలో కూడా డిసైడ్ చేసింది కూడా కిషన్ రెడ్డే. రాష్ట్ర […]
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించారు. ప్రధాని మోడీ సోమవారం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ఆసాంతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా జి. కిషన్ రెడ్డే అన్నింటినీ దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డే అందరినీ ఆహ్వానించారు.
అసలు ఎవరిని పిలవాలో కూడా డిసైడ్ చేసింది కూడా కిషన్ రెడ్డే. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సహకారం, భద్రత మాత్రమే అందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం జగన్, రాష్ట్ర టూరిజం శాఖ మంత్రిగా రోజాకు ఆహ్వానాలు అందాయి.
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆహ్వానాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తమను కార్యక్రమానికి పిలిచి అవమానించారని వాళ్లు ఆరోపిస్తున్నారు.
కేవలం కార్యక్రమానికి పిలిచి, ప్రధానిని కలిసే వారి జాబితా నుంచి మాత్రం తొలగించారని.. ఇది సీఎం జగన్ చేసిన కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు. అసలు కార్యక్రమంతో ఏ మాత్రం సంబంధం లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎంను కావాలనే టార్గెట్ చేస్తున్నారని పలువురు అంటున్నారు.
పీఎంవో నుంచి వచ్చిన జాబితాలో ఎంపీ రఘురామ, అచెన్నాయుడి పేర్లు లేవు. దీంతో అచ్చెన్నాయుడు స్వయంగా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి కూడా మాట్లాడారు. ఆదివారం రాత్రి కూడా కిషన్ రెడ్డికి ఈ విషయం చెప్పగా.. తాను చూసుకుంటానని కిషన్ రెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది. అయితే చివరి నిమిషంలో కిషన్ రెడ్డి ఫోన్ ఎత్తకపోవడంతో అచ్చెన్నాయుడు ఆ కార్యక్రమానికి రాలేదు.
ఎలాంటి హోదా లేని చిరంజీవిని వేదిక మీదకు ఎక్కించి ప్రధానితో కలిపి.. తనను మాత్రం సైడ్ చేశారంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఇది రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ నిర్లక్ష్యం వల్ల జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించాల్సింది పోయి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.
ఎస్పీజీ ఇచ్చే లిస్టు ప్రకారమే రాష్ట్ర పోలీసులు కూడా నడుచుకోవల్సి ఉంటుంది. కొత్త వారి పేర్లు అందులో యాడ్ చేయడానికి స్టేట్ పోలీస్‌కు అధికారం ఉండదు. దీంతో పేరు లేని రఘురామ, అచ్చెన్నలకు అక్కడికి పర్మిషన్ లేకుండా పోయింది. ఈ కారణంతోనే స్టేట్ పోలీసులే తమను రాకుండా అడ్డుకున్నారని ఇద్దరూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.