Telugu Global
National

ట్రాన్స్ జెండర్ పైలట్ పుడ్ డెలివరీ బాయ్ అయ్యాడు

ఇండియాలో తొలి ట్రాన్స్ జెండర్ పైలట్ ఫుడ్ డెలివరీ బాయ్ అయ్యాడు. విమానాలు నడుపుతూ ‘గాల్లో తేలిపోదామనుకున్న’ అతడి ఆశలు నీరుగారిపోయాయి. నువ్వు పైలట్ అయ్యేందుకు అనర్హుడివని అతడిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. . నువ్వు హార్మోన్ థెరపీ చికిత్స తీసుకుంటున్నందున విమానాలు నడపజాలవని పేర్కొంటూ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది తాత్కాలికమే అని చెబుతున్నప్పటికీ.. ఈ ‘అనర్హత’ ఎంతకాలం ఉంటుందో తెలియక ఆ ట్రాన్స్ జెండర్ పైలట్ తల్లడిల్లుతున్నాడు. […]

Harry
X

ఇండియాలో తొలి ట్రాన్స్ జెండర్ పైలట్ ఫుడ్ డెలివరీ బాయ్ అయ్యాడు. విమానాలు నడుపుతూ ‘గాల్లో తేలిపోదామనుకున్న’ అతడి ఆశలు నీరుగారిపోయాయి. నువ్వు పైలట్ అయ్యేందుకు అనర్హుడివని అతడిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. . నువ్వు హార్మోన్ థెరపీ చికిత్స తీసుకుంటున్నందున విమానాలు నడపజాలవని పేర్కొంటూ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది తాత్కాలికమే అని చెబుతున్నప్పటికీ.. ఈ ‘అనర్హత’ ఎంతకాలం ఉంటుందో తెలియక ఆ ట్రాన్స్ జెండర్ పైలట్ తల్లడిల్లుతున్నాడు.

23 ఏళ్ళ ఇతని పేరు యాడమ్ హ్యారీ ! 2019 లో ఇండియాకు వచ్చిన ఇతడు ఈ దేశంలో మొదటి ట్రాన్స్ జెండర్ ట్రైనీ పైలట్ గా గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికా నుంచి ప్రైవేట్ పైలట్ లైసెన్స్ పొందిన హ్యారీ.. హార్మోన్ థెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. ఇతనికి తిరువనంతపురం లోని రాజీవ్ గాంధీ అకాడెమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీ సంస్థ 2020 జనవరిలో కమర్షియల్ పైలట్ లైసెన్సును కూడా మంజూరు చేసింది.

పైగా విమానాలు నడపాలన్న కోర్కె బలీయంగా ఉన్న హ్యారీకి కేరళ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ సాయపడింది. ఫ్లయింగ్ ఇనిస్టిట్యూట్ లో ఇతడి అడ్మిషన్ కి తోడ్పడింది. జన్మతః ఆడ శిశువుగా పుట్టినప్పటికీ తనను పురుష లక్షణాలున్నవాడిగా చెప్పుకుంటూ వచ్చాడట.

మగ గొంతుక, గడ్డం కూడా ఇందుకు అతనికి తోడయ్యాయి. శాశ్వత పైలట్ లైసెన్స్ పొందేందుకు ఎన్నో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. కానీ ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగం ఇచ్చే ఆప్షన్ డీజీసీఏలో లేనందున తనను మహిళగా చెప్పుకుంటూనే దరఖాస్తు పెట్టుకోవాల్సి వచ్చింది.

అన్ని టెస్టులు అయ్యాక డీజీసీఏ ఇతడిని తాత్కాలికంగా అన్ ఫిట్ అని ప్రకటించింది. ప్రస్తుతం క్రాస్ సెక్స్ హార్మోన్ థెరపీ తీసుకుంటున్న హ్యారీ.. ఈ చిత్స అయ్యాక తిరిగి తాజాగా దరఖాస్తు పెట్టుకోవాల్సి వస్తుంది. అంతవరకు నువ్వు ఫుడ్ డెలివరీ ఏజంటుగా పని చేయాలంటూ ఇతడిని డీజీసీఏ ఆదేశించింది.

పైగా అధికారులు తన వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతూ తనను వేధించినంత పని చేస్తున్నారని హ్యారీ వాపోతున్నాడు. నువ్వు ఎవరిని ఎలా పెళ్లాడతావు, నీ భవిష్యత్ జీవితం ఎలా గడుపుతావు వంటి అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నారని దిగాలు పడుతున్నాడు. ట్రాన్స్ జెండర్ కావడమే తన పాపమైందా అంటున్నాడు.

First Published:  5 July 2022 1:41 AM GMT
Next Story