‘నూపుర్ శర్మ తల నరికి తెస్తే నా ఆస్తి మొత్తం ఇస్తా ’: వైరలవుతున్న వివాదాస్పద వీడియో
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగిన కొద్ది రోజులకే, ఆమెపై చాలామంది దాడికి దిగుతున్నారు. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు, ఒక వ్యక్తి ఏకంగా నూపుర్ శర్మ తల నరికివేయాలని పిలుపునిస్తూ ఒక వివాదాస్పద వీడియోను రిలీజ్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. పోలీసులు కూడా దానిని చూసి సీరియస్ గా తీసుకున్నారు. ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి […]
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై సుప్రీంకోర్టు నిప్పులు చెరిగిన కొద్ది రోజులకే, ఆమెపై చాలామంది దాడికి దిగుతున్నారు. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు, ఒక వ్యక్తి ఏకంగా నూపుర్ శర్మ తల నరికివేయాలని పిలుపునిస్తూ ఒక వివాదాస్పద వీడియోను రిలీజ్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. పోలీసులు కూడా దానిని చూసి సీరియస్ గా తీసుకున్నారు.
ప్రవక్త మహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ తల నరికి తెచ్చిన వారికి తన ఇంటితో పాటు ఆస్తిని బహుమతిగా ఇస్తానంటూ రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన వ్యక్తి సోమవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ముస్లింలను హింసిస్తున్నారని, చంపుతున్నారని అతను వ్యాఖ్యానించాడు.
తీవ్రవమైన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అజ్మీర్ లోని ప్రముఖ చిస్టీ దర్గా ప్రాంతానికి చెందిన సల్మాన్ ఛిస్తీగా పోలీసులు గుర్తించారు.
నూపుర్ శర్మ తలని తీసుకువచ్చే ఎవరికైనా తన ఇల్లు ఆస్తి ఇస్తానని చెప్పడం వీడియోలో వినిపించిందని పలువురు చెబుతున్నారు. ఖ్వాజా సాహెబ్ , మహమ్మద్ సాహెబ్‌ల ను కూడా నూపుర్ శర్మ అగౌరవ పర్చారని ఛిస్తీ ఆరోపించాడు. అందుకే తన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేస్తానంటూ చెప్పడం కూడా వినిపించిది.
వీడియో వైరల్ అవడంతో అదనపు పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ మీడియా ముందుకు వచ్చారు. తాను కూడా వాట్సాప్ ద్వారా కూడా ఈ వీడియో ప్రకటనను చూశానని చెప్పారు. వీడియోలో సల్మాన్ చిస్తీ మత్తులో కనిపించాడన్నారు. ఈ విషయంలో పోలీసులు దర్గా, అంజుమాన్ అధికారులతో కూడా మాట్లాడారు. వారు ఈ వీడియో వైరల్‌గా మారకుండా ఆపాలని సూచించామన్నారు. “ఈ వీడియోను పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. సమాజంలో అశాంతి కలిగించే ఎటువంటి సంఘటనలను అనుమతించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని” ఆయన చెప్పారు.