Telugu Global
NEWS

డేటా చోరీ నిజమే.. – హౌస్ కమిటీ చైర్మన్ భూమన

పెగాసస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏపీ ప్రభుత్వం.. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ప్రత్యర్థులపై నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్టు కూడా వైసీపీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు హస్తం ఉందని వైసీపీ ఆరోపించింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్య‌ర్థ‌న మేర‌కు శాస‌న‌స‌భ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు తిరుపతి ఎమ్మెల్యే […]

డేటా చోరీ నిజమే.. – హౌస్ కమిటీ చైర్మన్ భూమన
X

పెగాసస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఏపీ ప్రభుత్వం.. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసి ప్రత్యర్థులపై నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు కొందరు అధికారులు సహకరించినట్టు కూడా వైసీపీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు హస్తం ఉందని వైసీపీ ఆరోపించింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అభ్య‌ర్థ‌న మేర‌కు శాస‌న‌స‌భ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీ వేశారు.

ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఈ కమిటీ విచారణ జరుపుతోంది. తాజాగా ఈ విషయంపై భూమన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగిన మాట నిజమేనని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కొన్ని వివరాలు సేకరించామన్నారు. ఈ అంశానికి సంబంధించి త్వరలోనే కొందరిని విచారణకు పిలుస్తామని చెప్పారు.

రాష్ట్రంలో 2016-2019 మధ్య తెలుగుదేశం హయాంలో డేటా చోరీ జరిగిందని చెప్పారు. అప్పటి ప్రభుత్వం డేటా సేకరించి.. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటాను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. అమరావతి అసెంబ్లీలో మంగళవారం భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో హౌస్ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. హౌస్ కమిటీ సభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి, మెుండితోక జగన్మోహన్ రావు, హోం, ఐటీ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇప్పటికే ఒకసారి సమావేశమైన ఈ కమిటీ జూలై5న మరోసారి విచారణ చేపడతామని నాడు ప్రకటించింది. ఇందులో భాగంగా మంగళవారం అసెంబ్లీలో భేటీ అయ్యింది. పెగాస‌స్ సంస్థకు చెందిన బృందం నాటి టీడీపీ ప్రభుత్వాన్ని సంప్రదించిందా..? ఆ భేటీలో ఎవ‌రేమ‌న్నారు? ఒప్పందం కుదిరిందా? కుదిరి ఉంటే దానికి సంబంధించిన ప‌త్రాలు.. లేదంటే ఒప్పందం కుద‌ర‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలేమిటి? అన్న విష‌యాల‌పై ఈ క‌మిటీ అధికారుల‌ను ప్రశ్నించింది.

ఈ సమావేశంలో చైర్మన్‌ భూమన కరుణారెడ్డి మాట్లాడుతూ.. తమకు అనుకూలంగా ఉన్నవారి ఓట్లను ఉంచి ఇతరుల ఓట్లు తొలగించిందనే ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం కావాలనే డేటా దొంగిలించి రాజకీయ లబ్ధి పొందినట్లు స్పష్టత వచ్చిందని భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు.

First Published:  5 July 2022 7:42 AM GMT
Next Story