Telugu Global
NEWS

జనసేనతో కటీఫ్ కాలేదు.. పొత్తు ఉంది.. సోము వీర్రాజు క్లారిటీ..!

నిన్న భీమవరంలో జరిగిన మీటింగ్‌ అనేక రాజకీయ చర్చలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల స్థానిక ఎంపీ రఘురామ కృష్ణ రాజు హాజరుకాలేదు. దీంతో ఆయన మీడియాలో తెగ గగ్గోలు పెట్టారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనిపించకపోగా.. ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి వేదిక మీద దర్శనమిచ్చారు. దీంతో రకరకాల ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి. జనసేన, బీజేపీ […]

జనసేనతో కటీఫ్ కాలేదు.. పొత్తు ఉంది.. సోము వీర్రాజు క్లారిటీ..!
X

నిన్న భీమవరంలో జరిగిన మీటింగ్‌ అనేక రాజకీయ చర్చలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే వివిధ కారణాల వల్ల స్థానిక ఎంపీ రఘురామ కృష్ణ రాజు హాజరుకాలేదు. దీంతో ఆయన మీడియాలో తెగ గగ్గోలు పెట్టారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కనిపించకపోగా.. ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి వేదిక మీద దర్శనమిచ్చారు. దీంతో రకరకాల ఊహాగానాలు తెరమీదకు వచ్చాయి.

జనసేన, బీజేపీ తెగదెంపులు చేసుకున్నట్టేనని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. తాము జనసేనతో కటీఫ్ కాలేదని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకుంటామని స్పష్టంచేశారు. అయితే నిన్నటి సభకు పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదని.. ప్రశ్నించగా.. పవన్ కల్యాణ్ రాకపోయినా ఆయన తరఫున కొందరు జనసైనికులు సభకు హాజరయ్యారని చెప్పడం గమనార్హం.

ఇదిలా ఉంటే జనసేన, బీజేపీ బంధం ఇక తెగిపోయినట్టేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు జనసేన కూడా టీడీపీతో దగ్గరయ్యేందుకు ఆసక్తిచూపుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఎవరితో పొత్తులు పెట్టుకున్నా.. ఈ సారి బెట్టు చేసి కాస్త ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలని చూస్తోంది. కానీ అందుకు టీడీపీ ఒప్పుకోవడం కష్టమే.

కేవలం బీజేపీతో మాత్రమే పొత్తుపెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందేమోనని పవన్ కల్యాణ్ భయపడుతున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఇక బీజేపీ అధిష్టానం పవన్ కల్యాణ్ ను పెద్దగా పట్టించుకోవడం లేనట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నిన్నటి భీమవరం మీటింగ్ పలు రాజకీయ చర్చలకు తావిచ్చింది.

First Published:  5 July 2022 12:20 PM IST
Next Story