ప్రభుత్వం పడిపోవడంతో ఆదిత్య ఠాక్రే పెళ్లి కూడా ఆగిపోయిందట.. నిజమేనా?
శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మనుమడు, మాజీ మంత్రి, వర్లి ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే పెళ్లి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తండ్రి ఉద్దవ్ ఠాక్రే కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆదిత్య.. షిండే సీఎం అయ్యాక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉద్దవ్ ప్రభుత్వాన్ని కూల్చేయడంతో అధికారం కోల్పోయాడు. అటు ప్రభుత్వం కూలిపోవడంతో ఆదిత్య ఠాక్రే వివాహం కూడా రద్దయ్యిందంటూ మరాఠా మీడియా కథనాలు వెలువరించింది. ఉద్దవ్ ప్రభుత్వానికి, ఆదిత్య ఠాక్రే పెళ్లికి లింకేంటని […]
శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మనుమడు, మాజీ మంత్రి, వర్లి ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే పెళ్లి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తండ్రి ఉద్దవ్ ఠాక్రే కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆదిత్య.. షిండే సీఎం అయ్యాక సాధారణ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉద్దవ్ ప్రభుత్వాన్ని కూల్చేయడంతో అధికారం కోల్పోయాడు. అటు ప్రభుత్వం కూలిపోవడంతో ఆదిత్య ఠాక్రే వివాహం కూడా రద్దయ్యిందంటూ మరాఠా మీడియా కథనాలు వెలువరించింది.
ఉద్దవ్ ప్రభుత్వానికి, ఆదిత్య ఠాక్రే పెళ్లికి లింకేంటని అందరికీ అనుమానం రావొచ్చు. అసలు విషయం ఏంటంటే.. శివసేనకు ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో ఉద్దవ్ మహారాష్ట్ర సీఎం అయ్యారు. మహా వికాస్ అఘాడీ ఏర్పడటానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చొరవ కూడా ఉన్నది. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం శరద్ పవార్ తన మనుమరాలు రేవతి సూలేతో ఆదిత్య ఠాక్రే పెళ్లి చేయాలని ప్రతిపాదించారట. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూతురే రేవతి సూలే. వీరిద్దరి పెళ్లి చేయడం ద్వారా శివసేన-ఎన్సీపీ బంధం కూడా బలోపేతం అవుతుందని తాత శరద్ పవార్ ఆలోచించారని ఆ కథనంలో పేర్కొన్నారు.
అయితే మహారాష్ట్రలో ఎంవీఏ సర్కార్ కూలిపోవడంతో ఆ ప్రభావం ఆదిత్య-రేవతిల పెళ్లిపై కూడా పడిందని పేర్కొన్నారు. వాస్తవానికి ఆదిత్య-రేవతి ప్రేమలో ఉన్నారని కూడా మూడేళ్ల క్రితం మరాఠా పత్రికలు కోడై కూసాయి. కానీ వారిద్దరూ ఆ విషయంపై ఏ రోజూ స్పందించలేదు. ఆ తర్వాత శరద్ పవార్ వారిద్దరికీ పెళ్లి చేయడానికి నిశ్చయించినట్లు కూడా రాసుకొచ్చాయి. చివరకు ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పెళ్లి మాటలు అటకెక్కాయని చెప్తున్నాయి.
ఆదిత్య-రేవతిలకు పెళ్లి చేయాలని ఏనాడూ ఇరు కుటుంబాలు భావించలేదని సన్నిహితులు చెప్తున్నారు. అసలు వాళ్లిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని..అవన్నీ మీడియా పుట్టించిన పుకార్లే అని స్పష్టం చేస్తున్నారు. అసలు పెళ్లి ప్రస్తావనే లేనప్పుడు, పెళ్లి ఆగిపోయే అవకాశం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఇరువురి స్నేహితులను అడిగితే.. మాకు ఏం తెలియదని దాటేస్తున్నారు. ఏదేమైనా రెండు పార్టీల నాయకుల వారసుల మధ్య పెళ్లి అనే విషయం మాత్రం ఇప్పుడు మహారాష్ట్రలో హాట్ టాపిక్‌గా మారింది.