Telugu Global
International

పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన స్పైస్ జెట్ విమానం

ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం పాకిస్తాన్‌లోని కరాచిలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మంగళవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి బయలు దేరిన విమానం, మరి కొంతమంది ప్యాసింజర్స్‌ను ఎక్కించుకోవడానికి ముంబై చేరుకున్నది. అనంతరం దుబాయ్ వెళ్లడానికి టేకాఫ్ తీసుకుంది. అయితే గాల్లోకి ఎగిరిన కొంతసేపటి తర్వాత ఇంధన వ్యవస్థలో సమస్య ఉన్నట్లు గుర్తించారు. దుబాయ్‌కి వెళ్తున్న బోయింగ్ 737-8 మ్యాక్స్ (వీటీ-ఎంఎక్స్‌జీ) రకం విమానాన్ని ఢిల్లీ – దుబాయ్ మధ్య ఎస్‌జీ-011 నెంబర్‌తో […]

పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన స్పైస్ జెట్ విమానం
X

ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్ జెట్ విమానం పాకిస్తాన్‌లోని కరాచిలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మంగళవారం ఢిల్లీ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి బయలు దేరిన విమానం, మరి కొంతమంది ప్యాసింజర్స్‌ను ఎక్కించుకోవడానికి ముంబై చేరుకున్నది. అనంతరం దుబాయ్ వెళ్లడానికి టేకాఫ్ తీసుకుంది. అయితే గాల్లోకి ఎగిరిన కొంతసేపటి తర్వాత ఇంధన వ్యవస్థలో సమస్య ఉన్నట్లు గుర్తించారు.

దుబాయ్‌కి వెళ్తున్న బోయింగ్ 737-8 మ్యాక్స్ (వీటీ-ఎంఎక్స్‌జీ) రకం విమానాన్ని ఢిల్లీ – దుబాయ్ మధ్య ఎస్‌జీ-011 నెంబర్‌తో నడిపిస్తున్నారు. ఈ విమానం గాల్లో ఉండగా ఇంధన వ్యవస్థలో లోపం ఉన్నట్లు పైలెట్లు గుర్తించారు. సమస్యను గాల్లోనే పరిష్కరించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను వాడారు. కానీ ఎడమ వైపు ఉన్న ఇంధన ట్యాంకు నుంచి ఫ్యూయల్ కారిపోతున్నట్లు ఇండికేటర్ సూచించింది. అత్యంత వేగంగా ఇంధనం లీక్ అవుతున్నట్లు ఆ ఇండికేటర్ చెప్పడంతో.. చీఫ్ పైలెట్ వెంటనే సమీపంలోని కరాచీ ఎయిర్‌పోర్టులో దింపడానికి ఏటీసీ పర్మిషన్ అడిగారు. కరాచీ ఏటీసీ అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

స్పైస్ జెట్ విమానం కరాచీలో దిగినా.. అక్కడ ఎయిర్‌పోర్టు ఎమర్జెన్సీ ఏమీ ప్రకటించలేదు. విమానం బయలు దేరడానికి ముందు పూర్తిగా తనిఖీలు చేశారని.. అప్పుడు ఎలాంటి సమస్య ఉన్నట్లు కనిపించలేదని సిబ్బంది చెప్తున్నారు. లెఫ్ట్ ట్యాంక్ మామూలుగానే ఉన్నట్లు అధికారులు అంటున్నారు. అయితే గాల్లోకి ఎగిరిన తర్వాతే సమస్య మొదలైందని వెల్లడించారు.

ఈ ఘటనపై స్పైస్ జెట్ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు. జూలై 5న బయలుదేరిన ఢిల్లీ-దుబాయ్ విమానాన్ని కరాచీకి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశాము. ఇండికేటర్ లైట్ మాల్ ఫంక్షనింగ్ కారణంగానే పైలెట్లు కరాచీలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అక్కడ ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదు. ల్యాండింగ్ కూడా స్మూత్‌గానే జరిగిందని చెప్పారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది సురక్షితంగా ఉన్నారని.. కరాచీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు ఆహారం అందించామని వివరించారు.

కరాచీలో ఉన్న విమానాన్ని బాగు చేయడానికి మరో విమానంలో సిబ్బంది వెళ్తున్నారని.. ఆ విమానమే కరాచీలోని ప్రయాణికులను దుబాయ్ తీసుకొని వెళ్తుందని స్పైస్ జెట్ తెలిపింది. ఫ్లైట్ ఇంజనీర్లు కరాచీలోని విమానాన్ని బాగు చేసి తిరిగి ఇండియాకు తీసుకొని వస్తారని స్పష్టం చేశారు.

First Published:  5 July 2022 9:38 AM IST
Next Story