మోడీకి చుక్కలు చూపించిన టీఆర్ఎస్ సోషల్ మీడియా
సోషల్ మీడియాని వాడుకోవడంలో మోదీ కింగ్ అని బీజేపీ నేతల అభిప్రాయం. రెండు దఫాలు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి.. సోషల్ మీడియాను బీజేపీ సమర్థంగా వినియోగించుకోవడం కూడా ఓ కారణం అంటారు. కానీ మోదీకే సోషల్ మీడియా విషయంలో షాకిచ్చాయి టీఆర్ఎస్ శ్రేణులు. సోషల్ మీడియా కింగ్ ని కాస్తా.. అదే సోషల్ మీడియాలో జుమ్లా కింగ్ అంటూ ర్యాగింగ్ చేసి వదిలిపెట్టాయి. #jumlakingmodi సోషల్ మీడియాలో ఆదివారం ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్ […]
సోషల్ మీడియాని వాడుకోవడంలో మోదీ కింగ్ అని బీజేపీ నేతల అభిప్రాయం. రెండు దఫాలు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి.. సోషల్ మీడియాను బీజేపీ సమర్థంగా వినియోగించుకోవడం కూడా ఓ కారణం అంటారు. కానీ మోదీకే సోషల్ మీడియా విషయంలో షాకిచ్చాయి టీఆర్ఎస్ శ్రేణులు. సోషల్ మీడియా కింగ్ ని కాస్తా.. అదే సోషల్ మీడియాలో జుమ్లా కింగ్ అంటూ ర్యాగింగ్ చేసి వదిలిపెట్టాయి. #jumlakingmodi సోషల్ మీడియాలో ఆదివారం ట్రెండింగ్ లో ఉన్న హ్యాష్ ట్యాగ్ ఇది. ముఖ్యంగా సభలో బీజేపీ నేతల ప్రసంగం మొదలు కాగానే, ఈ హ్యాష్ ట్యాగ్ పై వేలాది ట్వీట్లు పడ్డాయి. మోదీ ప్రసంగం ఆసాంతం ట్వీట్లు పడుతూనే ఉన్నాయి.
మోదీ తన ప్రసంగంలో చెప్పిన లెక్కలన్నీ జుమ్లా అంటూ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు జవాబులేవంటూ నిలదీశారు.
మోదీ ఓ జుమ్లా కింగ్ – మాతాశిశు సంరక్షణ కింద కేంద్రం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
మోదీ ఓ జుమ్లా కింగ్ – మోదీ అధికారంలోకి వచ్చాక ఆకలి సూచీలో భారత్ 63వ ర్యాంక్ నుంచి 101 స్థానానికి పడిపోయింది.
మోదీ ఓ జుమ్లా కింగ్ – 8 ఏళ్లలో భారత్ లో లివింగ్ కాస్ట్ పెరిగింది, కొనుగోలు శక్తి తగ్గింది.
మోదీ ఓ జుమ్లా కింగ్ – మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ లు.
మోదీ ఓ జుమ్లా కింగ్ – ఐటీఐఆర్ కు సపోర్ట్ చేయలేదు, తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు, నీతి ఆయోగ్ రికమెండేషన్స్ పట్టించుకోలేదు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, కాజీపేట రైల్వే కోచ్ గురించి మాట్లాడలేదంటూ.. ట్విట్టర్ హోరెత్తింది. మూడు గంటల్లో దాదాపు 80వేల ట్వీట్లు ఈ హ్యాష్ ట్యాగ్ తో పడ్డాయంటే ఏ రేంజ్ లో ఎదురుదాడి జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
సాలు మోదీ సంపకు మోదీ..
బీజేపీ నేతల ప్రసంగాన్ని టీవీలతోపాటు.. చాలామంది సోషల్ మీడియాలో లైవ్ లో చూశారు. బీజేపీ అధికారిక యూట్యూబ్ ఛానెల్స్ తోపాటు, వివిధ శాటిలైట్ ఛానెల్స్ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. లైవ్ షో నడిచేటప్పుడు పబ్లిక్ కామెంట్స్ విభాగంలో #సాలు మోదీ సంపకు మోదీ.. అనే హ్యాష్ ట్యాగ్ హోరెత్తింది. దాదాపుగా ఒక్కొకరు ఒక్కో ఛానెల్ లో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేసినట్టు స్పష్టమైంది. ఒకే అకౌంట్ నుంచి 10 సెకన్ల గ్యాప్ లో ఈ హ్యాష్ ట్యాగ్ పదే పదే కనపడేది. వ్యూహాత్మకంగా మోదీకి చుక్కలు చూపించారు టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు.
బోర్డింగ్ లు, హోర్డింగ్ లతో హోరెత్తించడం ఒకెత్తు అయితే.. నిన్న ఒక్కరోజే సోషల్ మీడియాలో మోదీపై వేసిన జోకులు, ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ లు మరో ఎత్తు. అందుకే చివర్లో మోదీ ప్రసంగం పేలవంగా ముగిసిందనే వాదన కూడా ఉంది. విమర్శలు చేయకుండానే ఈ స్థాయిలో కామెంట్లు పడితే.. ఇక టీఆర్ఎస్ సర్కారుపై విమర్శల డోసు పెంచితే ఏ స్థాయిలో ఆటాడేసుకుంటారో అని మోదీ వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. మొత్తమ్మీద.. ఇప్పటి వరకూ సోషల్ మీడియాని వాడుకోవడంలో బీజేపీ ముందుంది అనే అపోహ ఉండేది. కానీ టీఆర్ఎస్ శ్రేణులు అదే సోషల్ మీడియాని ఉపయోగించి బీజేపీకి చుక్కలు చూపించడం విశేషం.