Telugu Global
MOVIE UPDATES

సుమంత్ నుంచి మరో సస్పెన్స్ థ్రిల్లర్..!

అక్కినేని మనవడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కెరీర్ ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. ఆరంభంలో వరుసగా ప్లాప్ లు వచ్చాయి. ఆ తర్వాత సత్యం, గౌరి, గోదావరి వంటి హిట్లు వచ్చినా ఆ విజయాలను సుమంత్ కొనసాగించలేకపోయాడు. మధ్యలో మళ్ళీ రావాతో హిట్ కొట్టినా ఆ తర్వాత కూడా పరాజయాలే పలకరించాయి. ఇటీవల సుమంత్ హీరోగా జీ 5 ఓటీటీలో విడుదల అయిన మళ్ళీ మొదలైంది మూవీ మంచి హిట్ అయ్యింది. ఈ […]

Sumanth
X

అక్కినేని మనవడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కెరీర్ ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. ఆరంభంలో వరుసగా ప్లాప్ లు వచ్చాయి. ఆ తర్వాత సత్యం, గౌరి, గోదావరి వంటి హిట్లు వచ్చినా ఆ విజయాలను సుమంత్ కొనసాగించలేకపోయాడు.

మధ్యలో మళ్ళీ రావాతో హిట్ కొట్టినా ఆ తర్వాత కూడా పరాజయాలే పలకరించాయి. ఇటీవల సుమంత్ హీరోగా జీ 5 ఓటీటీలో విడుదల అయిన మళ్ళీ మొదలైంది మూవీ మంచి హిట్ అయ్యింది.

ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమాలో నటించేందుకు సుమంత్ అంగీకరించాడు. ఈ మూవీకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించనుండగా ప్రదీప్ నిర్మించనున్నాడు.

ఇందుకు సంబంధించి తాజాగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. సుమంత్ – సంతోష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. అంతకు ముందు వీరిద్దరూ కలసి సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో నటించారు. ఆలయం నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది.

ఇప్పుడు వస్తున్న సినిమా కూడా ఒక పురాతన ఆలయం నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయిన తరువాత ఆలయాల నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి.

మరి ఈ సినిమా సుమంత్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. సుమంత్ ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీతారామం అనే సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సుమంత్ హీరోగా కాకుండా ముఖ్య పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు.

First Published:  4 July 2022 12:26 PM
Next Story