Telugu Global
National

‘6 నెలల్లో మహారాష్ట్ర‌ ప్రభుత్వం పడిపోవడం, మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం’

శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోయి మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ అన్నారు. ముంబైలో ఎన్సీపీ శాసనసభ్యులు, పార్టీ ఇతర నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… “మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోవచ్చు, కాబట్టి మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి” అని అన్నారు. షిండేకు మద్దతు ఇస్తున్న చాలా […]

‘6 నెలల్లో మహారాష్ట్ర‌ ప్రభుత్వం పడిపోవడం, మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం’
X

శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోయి మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ అన్నారు. ముంబైలో ఎన్సీపీ శాసనసభ్యులు, పార్టీ ఇతర నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…

“మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో పడిపోవచ్చు, కాబట్టి మధ్యంతర ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి” అని అన్నారు.

షిండేకు మద్దతు ఇస్తున్న చాలా మంది తిరుగుబాటు శాసనసభ్యులు ప్రస్తుతం సంతోషంగా ఏమీ లేరని పవార్ అన్నారు. ఒక్కసారి మంత్రివర్గ శాఖలు పంపిణీ చేయబడితే, వారి అశాంతి బయటపడుతుందని, ఇది చివరికి ప్రభుత్వ పతనానికి దారి తీస్తుందని ఆయన అన్నారు.

ఆ తర్వాత చాలా మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ అసలు పార్టీలోకి తిరిగి వస్తారని కూడా పవార్ అభిప్రాయపడ్డారు. మన చేతిలో కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంది, ఎన్‌సిపి శాసనసభ్యులు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కువ సమయం గడపాలి అని ఎన్సీపీ నాయలకు పవార్ సూచించారు.

First Published:  4 July 2022 6:11 AM IST
Next Story