Telugu Global
NEWS

లింగంపల్లిలో రైలెక్కి బేగంపేటలో దిగిన రఘురామరాజు.. పీఎంవో లిస్టులో పేరు లేదనే..

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు గత కొన్ని రోజుల నుంచి మాటలతో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తన‌ను ఇబ్బంది పెడుతోందని ఒకవైపు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు.. మరోవైపు కోర్టులో పిటిషన్లతో బిజీగా గడిపారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈరోజు (సోమవారం) జరుగనున్న ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని, ఏపీ పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు కూడా […]

లింగంపల్లిలో రైలెక్కి బేగంపేటలో దిగిన రఘురామరాజు.. పీఎంవో లిస్టులో పేరు లేదనే..
X

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు గత కొన్ని రోజుల నుంచి మాటలతో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తన‌ను ఇబ్బంది పెడుతోందని ఒకవైపు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు.. మరోవైపు కోర్టులో పిటిషన్లతో బిజీగా గడిపారు.

భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. ఈరోజు (సోమవారం) జరుగనున్న ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని, ఏపీ పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు కూడా ఆయనను అరెస్టు చేయాలంటే రెండు రోజుల ముందు నోటీసు ఇవ్వాలని ఆదేశించింది.

ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అతిథుల జాబితాలో ఎంపీ రఘురామ రాజు పేరు లేదు. వేదికపై ఉండే వారి జాబితా, హెలీప్యాడ్ వద్ద ప్రధానిని ఆహ్వానించే వారి జాబితాలో అసలు ఎంపీ పేరే లేదని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ప్రకటించారు.

ఆయన కార్యక్రమానికి వస్తున్నారో లేదో అనే విషయం మాకు తెలియదని పాలరాజు చెప్పారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఫ్లయింగ్ ఆంక్షలు ఉన్నాయి. ఎవరైనా వాయుమార్గంలో రావాలనుకుంటే తప్పకుండా అనుమతులు తీసుకోవాలని పాలరాజు అన్నారు. రఘురామరాజు ఫోన్ నెంబర్‌ను పోలీసులు బ్లాక్ లిస్టులో పెట్టినట్లు వచ్చిన వార్తలు అబద్దమని ఆయన స్పష్టం చేశారు.

కాగా, భీమవరం వెళ్లడానికి తన వాహనానికి అనుమతి ఇవ్వాలని ఎంపీ రఘురామ పోలీసులను కోరారు. అయితే దానికి వారు నిరాకరించారు. దీంతో ఆయన లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో నర్సాపురం ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. తన అనుచరులతో సహా రైలెక్కిన తర్వాత ఆయన పేరు లిస్టులో లేదని తెలిసింది. దీంతో బేగంపేటలోనే రఘురామ రాజు అండ్ కో దిగిపోయారు. ఆ తర్వాత అందరూ కలసి రఘురామ ఇంటికి వెళ్లిపోయారు. అయితే రైలు దిగే ముందు రఘురామ ఒక వీడియో ప్రకటన చేశారు.

తాను భీమవరం వస్తున్నా అని తెలిసి చాలా మంది అభిమానులు సంతోషంగా ఉన్నారు. కానీ నేను రాలేకపోతున్నాను. మీరు బాధపడకండీ.. మీరెవ్వరూ ఆ సభకు వెళ్లవద్దు అంటూ చెప్పుకొచ్చారు. పీఎంవో లిస్టులో పేరు లేనందుకే రఘురామ మధ్యలో దిగిపోయారు. కానీ అభిమానులను పోలీసులు ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే తాను వెళ్లడం లేదని కవర్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

First Published:  3 July 2022 9:12 PM GMT
Next Story