Telugu Global
MOVIE UPDATES

కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టుగా… సోషల్ మీడియాలో ఆందోళన

లీనా మణిమేకలై అనే దర్శకురాలు తీసిన కాళీ అనే డాక్యుమెంటరీ తాలూకూ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. ఆమె విడుదల చేసిన పోస్టర్ లో కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఉంది. తమిళనాడుకి చెందిన లీనా… కెనడాలోని టొరొంటోలో నివసిస్తోంది. కెనడా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె సదరు పోస్టర్ ని విడుదల చేశారు. కాళీ మాత పాత్రని పోషించిన కళాకారిణి చేతుల్లో… ఒక చేతిలో త్రిశూలం ఉండగా మరోచేతిలో ఎల్ జిబిటిక్యూ కి చెందిన జెండా ఉంది. లీనా […]

Kaali movie
X

లీనా మణిమేకలై అనే దర్శకురాలు తీసిన కాళీ అనే డాక్యుమెంటరీ తాలూకూ పోస్టర్ వివాదాస్పదంగా మారింది. ఆమె విడుదల చేసిన పోస్టర్ లో కాళీమాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఉంది. తమిళనాడుకి చెందిన లీనా… కెనడాలోని టొరొంటోలో నివసిస్తోంది.

కెనడా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆమె సదరు పోస్టర్ ని విడుదల చేశారు. కాళీ మాత పాత్రని పోషించిన కళాకారిణి చేతుల్లో… ఒక చేతిలో త్రిశూలం ఉండగా మరోచేతిలో ఎల్ జిబిటిక్యూ కి చెందిన జెండా ఉంది. లీనా మణిమేకలైపై ఢిల్లీకి చెందిన న్యాయవాది జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆమె విడుదల చేసిన పోస్టరులో కాళీమాత చిత్రం చాలా అభ్యంతరకరంగా ఉందని, హిందువుల మనోభావాలను గాయపరచేలా ఆమె చిత్రీకరణ ఉన్నదని వెంటనే ఆమెపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఒక తమిళ వార్తా వెబ్ సైట్ అందిస్తున్న వివరాల ప్రకారం… ఒక సాయంత్రం వేళ టొరొంటో వీధులలో కాళీ మాత తిరుగుతూ దర్శనమిచ్చినప్పుడు జరిగే సంఘటనలను ఇతివృత్తంగా చేసుకుని డాక్యుమెంటరీ తీసినట్టుగా లీనా మణి మేకలై తెలిపారు.

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో నెటిజన్లు లీనా మణిమేకలైపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ‘ప్రతిరోజూ ఏదో ఒక విధంగా హిందూమతాన్ని కించపరుస్తూ.. హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారు…’ ఒక ట్విట్టర్ యూజర్ స్పందన ఇది. మరొకరు ఇదే తరహా ట్విట్టర్ పోస్టుని ప్రధానమంత్రి కార్యాలయానికి, అమిత్ షాకు ట్యాగ్ చేశారు.

ఎవరీ లీనా మణిమేకలై

ప్రస్తుతం కెనడాలో సినిమా రూపకల్పనకు సంబంధించిన కోర్సుని అభ్యసిస్తున్నారీమె. టొరొంటో మెట్రోపాలిటన్ యూనివర్శిటీ… సాంస్కృతిక వైవిధ్యంపై చిత్రీకరణలు చేసేందుకు నిర్వహిస్తున్న ఒక ప్రోగ్రామ్ కి లీనా ఎంపికయ్యారు. దీనికి ఎంపికైన 18మంది విద్యార్థుల్లో ఆమె కూడా ఒకరు. ఇంతకుముందు ఈమె తీసిన డాక్యుమెంటరీల్లో కూడా దేవతలను ప్రధాన ఇతివృత్తాల్లో భాగం చేశారు.

తాను విడుదల చేసిన పోస్టర్ లో కాళీమాత మనపై తన ప్రేమని చూపటం కనబడుతుందని, కెన్ సింగ్టన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న పార్కు వద్ద పనులు చేసుకునేవారు… ఆమెకు సిగరెట్ ఇచ్చినప్పుడు ఆమె ప్రేమగా తీసుకోవటం తాను చూపించానని లీనా తెలిపారు. తన డాక్యుమెంటరీలో మానవత్వాన్ని, భిన్నత్వాన్ని ప్రముఖంగా చూపించానని అన్నారు.

ఒక కవిగా, ఫిల్మ్ మేకర్ గా కాళీమాతని తనదైన దృక్పథం నుండి చూసినట్టుగా లీనా తెలిపారు. దక్షిణ భారత దేశంలో జరిగే పండుగల్లో కొంతమంది కాళీ మాత వేషం వేసుకుని దేశవాళీ లిక్కర్ ని తాగుతూ నృత్యం చేస్తుంటారని చెప్పుకొచ్చారామె. కళాకారులను భయానికి గురిచేసే పరిస్థితులు ఉండకూడదని, వారు శక్తిమంతంగా తమవైన భావాలను వెల్లడించగలిగి ఉండాలని లీనా మణిమేకలై అభిప్రాయపడుతున్నారు.

First Published:  4 July 2022 5:30 PM IST
Next Story