గజరాజుకు పాదరక్షలు.. భక్తుల ఔదార్యం..!
దేవస్థానాల్లో ఉండే గజరాజుల (ఏనుగులు) పట్ల కొందరు భక్తులు ఎంతో అభిమానం చూపిస్తారు. వాటిని కూడా దైవాలుగా పరిగణించే భక్తులూ ఉంటారు. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలిలో ఉన్న గాంధీమతి అమ్మన్ దేవస్థానంలోని ఏనుగుకు భక్తులు పాదరక్షలు కుట్టించారు. ఇలా ఓ ఏనుగు కోసం పాదరక్షలు కుట్టించడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. ఈ పాదరక్షల తయారీకి రూ.12,000 ఖర్చయ్యిందట.. నేలాయప్పర్ లోని గాంధీ మతి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ గుడి 2000 ఏళ్ల […]
దేవస్థానాల్లో ఉండే గజరాజుల (ఏనుగులు) పట్ల కొందరు భక్తులు ఎంతో అభిమానం చూపిస్తారు. వాటిని కూడా దైవాలుగా పరిగణించే భక్తులూ ఉంటారు. ఇదిలా ఉంటే తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలిలో ఉన్న గాంధీమతి అమ్మన్ దేవస్థానంలోని ఏనుగుకు భక్తులు పాదరక్షలు కుట్టించారు. ఇలా ఓ ఏనుగు కోసం పాదరక్షలు కుట్టించడం రాష్ట్రంలో ఇదే ప్రథమం.
ఈ పాదరక్షల తయారీకి రూ.12,000 ఖర్చయ్యిందట.. నేలాయప్పర్ లోని గాంధీ మతి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ఈ గుడి 2000 ఏళ్ల నాటిది. ఇక్కడికి భక్తులు కూడా తరచూ భారీ సంఖ్యలో హాజరవుతుంటారు.
ఇక్కడ ఉన్న గజరాజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏనుగును 13 ఏళ్ల వయసులో ఆలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం దీని వయసు 52 ఏళ్లు. 39 ఏళ్లుగా నేలాయప్పర్ దేవాలయంలో సేవలు చేస్తోంది ఈ గజరాజు. అయితే 2017లో ఈ గజరాజు అనారోగ్యానికి గురైంది. దీంతో ఆలయ నిర్వాహకులు వైద్యుడికి చూపించారు. అయితే అధిక బరువుతో ఏనుగు బాధ పడుతోందని వైద్యులు చెప్పారు. బరువు తగ్గించాలని సూచించారు.
ఈ ఏనుగు 300 కేజీలు బరువు అదనంగా ఉందని తెలిపారు. గజరాజు బరువు తగ్గితే ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. దీంతో ఆలయ నిర్వాహకులు అప్పటి నుంచి ఏనుగును ప్రతిరోజూ దాదాపు 5 కిలోమీటర్లు నడిపిస్తున్నారు. దీంతో కేవలం ఆరు నెలల్లోనే 150 కేజీల బరువు తగ్గింది ఏనుగు. అయితే అప్పటినుంచి ఏనుగు నడవడానికి ఇబ్బంది పడుతోంది. దీంతో భక్తులు ఏనుగుకు పాదరక్షలు కుట్టించారు.