Telugu Global
NEWS

మోడీ హెలీకాప్టర్ మీదకు బ్లాక్ బెలూన్స్ వదిలిన నిరసనకారులు… ఏపీ పోలీసులు చెప్పింది ఇదే..!

ప్రధాని మోడీ ఇవాళ ఏపీలోని భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి నేరుగా భీమవరంకు హెలీకాప్టర్‌లో వెళ్లిన మోడీ.. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత అదే హెలీకాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. మోడీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయంలో ఆయన హెలీకాప్టర్ చూసి కొంత మంది నల్ల బెలూన్లను ఎగురవేసి తమ నిరసనను తెలిపారు. డజన్ల కొద్ది బ్లాక్ బెలూన్స్ మోడీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ చుట్టూ ఎగురుతుండటంతో పోలీసులతో పాటు […]

Narendra Modi
X

ప్రధాని మోడీ ఇవాళ ఏపీలోని భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నుంచి నేరుగా భీమవరంకు హెలీకాప్టర్‌లో వెళ్లిన మోడీ.. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత అదే హెలీకాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.

మోడీ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయంలో ఆయన హెలీకాప్టర్ చూసి కొంత మంది నల్ల బెలూన్లను ఎగురవేసి తమ నిరసనను తెలిపారు. డజన్ల కొద్ది బ్లాక్ బెలూన్స్ మోడీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ చుట్టూ ఎగురుతుండటంతో పోలీసులతో పాటు బీజేపీ నాయకులు కూడా ఆందోళన చెందారు. స్థానికులు అసలు ఆ బెలూన్లు ఏంటని ఆరా తీశారు.

బ్లాక్ బెలూన్స్ వదలడంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఇలా ప్రధాని ప్రయాణిస్తున్న హెలీకాప్టర్‌పై కొన్ని దుష్టశక్తులు కావాలని బెలూన్లు ఎగురవేశాయని ఆయన ఆరోపించారు. ఆ బెలూన్ల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న శక్తులు, కుట్రదారులు ఎవరో నిగ్గు తేల్చాలని వీర్రాజు కోరారు.

బ్లాక్ బెలూన్స్ ఘటనపై ఏపీ పోలీసులను ప్రధాని భద్రతా వ్యవహారాలు చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఆగ్రహం వ్యక్తం చేసిందని, వెంటనే వివరణ ఇవ్వమని కోరిందని మీడియాలో వార్తల వచ్చాయి. కాగా, దీనిపై ఎస్పీజీ ఎలాంటి వివరణ కోరలేదని ఏపీ పోలీసులు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ పర్యటనలో ఏపీ పోలీసుల వైఫల్యం అసలు లేదని తేలింది. ఏపీ పోలీసులు ప్రస్తుతం బెలూన్లను గాల్లోకి ఎగురవేసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ బెలూన్లలో పూర్తిగా నైట్రోజన్ లేదని.. అవి అపాయకరం కూడా కాదని గుర్తించారు. కేవలం గాలి వల్ల కాసేపు పైకి ఎగిరి కింద పడిపోయానని పోలీసులు చెప్పారు. ప్రధాని ప్రయాణించిన హెలీకాప్టర్‌కు, బెలూన్లు ఎగురవేసిన ప్రదేశానికి మధ్య నాలుగు కిలోమీటర్ల దూరం ఉందని.. కేవలం నిరసన తెలపడానికే ఎగురవేశారే తప్ప.. కుట్రకోణం లేదని అంటున్నారు.

ఈ బెలూన్లు ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రతన్ నేతృత్వంలోనే ఎగరేసినట్లు తెలుస్తున్నది. ఏపీకి ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చలేదనే కారణంతోనే తమ నిరసన తెలియజేస్తూ కొంత మంది యువకులు డాబాలపై నుంచి బెలూన్లు వదిలి తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ నిరసన వ్యక్తం చేసేందుకు రాగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఏపీసీసీ చీఫ్ శైలజానాధ్‌ను కూడా నిర్భంధించారు.

First Published:  4 July 2022 2:04 PM IST
Next Story