Telugu Global
National

అగ్నిపథ్ పథకంపై విచారించేందుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

త్రివిద దళాల్లో కొత్తగా సైనికులను కేవలం నాలుగేళ్ల కాలపరిమితికే తీసుకునేలా ‘అగ్నిపథ్ పథకం‘ పేరుతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఆర్మీలో కింది స్థాయిలో శాశ్వత నియామకాలు ఉండవని.. అన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉంటాయని ఆర్మీ కూడా స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. యూపీ, బీహార్, తెలంగాణలో ఎంతో మంది ఆర్మీ ఉద్యోగార్థులు రైళ్లను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. మరి కొంత మంది అగ్నిపథ్ పథకంపై […]

Supreme Court
X

త్రివిద దళాల్లో కొత్తగా సైనికులను కేవలం నాలుగేళ్ల కాలపరిమితికే తీసుకునేలా ‘అగ్నిపథ్ పథకం‘ పేరుతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇకపై ఆర్మీలో కింది స్థాయిలో శాశ్వత నియామకాలు ఉండవని.. అన్నీ నాలుగేళ్ల కాలపరిమితితో ఉంటాయని ఆర్మీ కూడా స్పష్టం చేసింది.

దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. యూపీ, బీహార్, తెలంగాణలో ఎంతో మంది ఆర్మీ ఉద్యోగార్థులు రైళ్లను తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. మరి కొంత మంది అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

తాజాగా ఈ పిటిషన్ విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే సోమవారం ఈ పిటిషన్లపై విచారణ చేస్తామని, వాదనలు వింటామని అత్యున్నత కోర్టు చెప్పింది. వైమానికి దళ అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తున్నది.

ఆ అభ్యర్థులందరూ శిక్షణ పొంది, అపాయింట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారని వారి తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. వీళ్లకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చి ఉంటే 20 ఏళ్ల పాటు ఉద్యోగంలో ఉండేవారు.. కానీ కేంద్రం అంతలోనే అగ్నిపథ్ పథకం తేవడంతో వీరి ఉద్యోగ కాలం 4 ఏళ్లకు తగ్గిపోయిందని కోర్టుకు చెప్పారు.

ఆ అభ్యర్థులందరికీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఉద్యోగంలో చేరడానికి మరొక్క అడుగే ఉన్న సమయంలో అగ్నిపథ్ పథకం వారి ఆశలు, కలలపై నీళ్లు చల్లిందని.. సాధ్యమైనంత త్వరగా దీనిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఈ విచారణపై ఎంతో మంది అభ్యర్థుల జీవితాలు ఆధారపడి ఉన్నాయని లాయర్ కోర్టుకు చెప్పారు.

కాగా, ఇప్పటికే అగ్నివీరుల కోసం నోటిఫికేషన్ జారీ అయ్యింది. 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న వారు దీనికి అర్హులు. ఈ ఒక్కసారికి మాత్రం 23 ఏళ్ల లోపు వారు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైతే నాలుగేళ్ల పాటు ఆర్మీలో పని చేయాల్సి ఉంటుంది. వీరిలో కేవలం 25 శాతం మంది ఆర్మీ విచక్షణ మేరకు శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు. మిగిలిన వాళ్లంతా ఆర్మీ నుంచి రిలీవ్ కావల్సి ఉంటుంది. వారికి పెన్షన్ లాంటి బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

First Published:  4 July 2022 2:27 AM GMT
Next Story