Telugu Global
NEWS

వన సంపదపై ఆదివాసీలకు హక్కు.. ఈ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీలోని భీమవరంలో పర్యటించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు, బ్రిటిషర్లను ఎదిరించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించారు. పెద అమిరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల విగ్రహాన్ని.. అక్కడికి కొంత దూరంలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి వర్చువల్ పద్దతిలో ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు. భీమవరం సభలో కూడా ప్రధాని మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘యావత్ భారతావనికే […]

narendra modi
X

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఏపీలోని భీమవరంలో పర్యటించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మన్యం వీరుడు, బ్రిటిషర్లను ఎదిరించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భీమవరంలో ఆవిష్కరించారు. పెద అమిరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల విగ్రహాన్ని.. అక్కడికి కొంత దూరంలో నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచి వర్చువల్ పద్దతిలో ఆవిష్కరించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.

భీమవరం సభలో కూడా ప్రధాని మోడీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘యావత్ భారతావనికే స్పూర్తిదాయకంగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టం’ అంటూ మోడీ తెలుగులో మాట్లాడారు. ఈ వీర భూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, ఎందరో మహానుభావులు ఈ దేశం కోసం త్యాగం చేశారని మోడీ గుర్తు చేశారు. అల్లూరి ఆదివాసీల శౌర్యానికి ప్రతీక అని చెప్పారు. అల్లూరి జీవితం మనందరికి స్పూర్తిదాయకమన్నారు. అల్లూరితో పాటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడని అన్నారు.

గత ఎనిమిదేళ్లలో అనేక కార్యక్రమాలను చేపట్టామని.. యువకులు, మహిళలకు అనేక అవకాశాలు కల్పించామని మోడీ అన్నారు. ముఖ్యంగా రైతులు. ఆదివాసీలకు లబ్ది చేకూరుస్తున్నామన్నారు. ఆదివాసీల బలిదానాలను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వారి వీరోచిత పోరాటాలు, బలిదానాలు భావి తరాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన వివరించారు.

అటవీ ప్రాంతం పెరుగుతుండటంతో అక్కడ వెదురు కోతకు అవకాశం కల్పించామని, వన సంపదపై ఆదివాసీలకే హక్కు కల్పించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని మోడీ తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిలో భాగంగా మన్యం జిల్లాలను కూడా డెవలప్ చేస్తున్నామని అన్నారు. మాతృభాషలో విద్య కోసం దేశవ్యాప్తంగా 750 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటయ్యాయని, అత్యున్నత ప్రమాణాలతో విద్యును అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లంబసింగిలో అల్లూరి మ్యూజియంను ఏర్పాటు చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. అల్లూరి తిరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక సిద్దం చేస్తామన్నారు. మొగల్లులో ధ్యాన మందిరం, చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని మోడీ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఒక పుణ్యభూమి..

స్వాతంత్ర సాధనలో పాల్గొన్న సమరయోధుల పోరాట పటిమ గురించి అందరికీ తెలయజేయాలనే అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుతున్నట్లు చెప్పారు. ఆనాడు మనదే రాజ్యం అనే నినాదంతో అల్లూరి ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చారని అన్నారు. మన్యం వీరుడు ఆంగ్లేయులపై వీరోచితంగా పోరాడాడని.. ఈ ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, వీరభూమి అని మోదీ కొనియాడారు. ఎంతో మంది దేశభక్తులకు పురుడుపోసిన గడ్డ అని అన్నారు. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం పంతులు వంటి మహానుభావులు జన్మించిన గడ్డ ఆంధ్రప్రదేశ్ అని మోడీ చెప్పారు. యువత సమస్యలపై పోరాడేతత్వం నేర్చుకోవాలని మోడీ చెప్పారు. ల్లూరి చేసిన పోరాటాలు మనకు స్పూర్తినిస్తాయని అన్నారు. ఆయన స్పూర్తితో ముందుకెళ్తే మనల్ని ఎవ్వరూ ఆపలేరని మోడీ వెల్లడించారు.

First Published:  4 July 2022 9:09 AM IST
Next Story