Himachal Pradesh: లోయలో పడ్డ బస్సు… విద్యార్థులతో సహా 16 మంది మృతి!
హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో పాఠశాల విద్యార్థులతో సహా 16 మంది చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది. బస్సు కింద మరింత మంది చనిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సైంజ్‌కు వెళుతున్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలోని లోయలో పడిపోయింది. జిల్లా అధికారులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు కులు డిప్యూటీ కమీషనర్ అశుతోష్ గార్గ్ తెలిపారు. […]
హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో పాఠశాల విద్యార్థులతో సహా 16 మంది చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది. బస్సు కింద మరింత మంది చనిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సైంజ్‌కు వెళుతున్న బస్సు జంగ్లా గ్రామ సమీపంలోని లోయలో పడిపోయింది. జిల్లా అధికారులు, రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయని, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు కులు డిప్యూటీ కమీషనర్ అశుతోష్ గార్గ్ తెలిపారు.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
”హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందించడానికి ప్రధాన మంత్రి ఆమోదించారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ఇవ్వబడుతుంది, ” అని ప్రధాని కార్యాలయం ట్వీట్ లో పేర్కొంది.