Telugu Global
CRIME

ఉద‌య్‌పూర్ టైల‌ర్ హ‌త్య‌కు ముందే మ‌హారాష్ట్ర‌లో ఇదే కార‌ణంతో ఫార్మ‌సిస్టు హ‌త్య‌!

నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌లు రేపిన చిచ్చు ఎంద‌రి ప్రాణాల మీదికి తెస్తుందో అనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆమె వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేసిన వ్య‌క్తులు హ‌త్య‌కు గుర‌వుతున్నార‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి. రాజ‌స్థాన్ లోని ఉద‌య్‌పూర్  లో టైల‌ర్ క‌న్హ‌య్య లాల్‌ను కిరాత‌కంగా హ‌త్య చేశారు. అత‌ని హ‌త్య‌కు ముందు జూన్ 21న మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేశ్ ప్ర‌హ్లాద‌రావు కోల్హే అనే 54 ఏళ్ల ఫార్మసిస్టు హత్య జరిగింది. అత‌నిని క‌త్తితో పొడిచి హ‌త్య చేశారు. […]

ఉద‌య్‌పూర్ టైల‌ర్ హ‌త్య‌కు ముందే మ‌హారాష్ట్ర‌లో ఇదే కార‌ణంతో ఫార్మ‌సిస్టు హ‌త్య‌!
X

నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌లు రేపిన చిచ్చు ఎంద‌రి ప్రాణాల మీదికి తెస్తుందో అనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆమె వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేసిన వ్య‌క్తులు హ‌త్య‌కు గుర‌వుతున్నార‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి. రాజ‌స్థాన్ లోని ఉద‌య్‌పూర్ లో టైల‌ర్ క‌న్హ‌య్య లాల్‌ను కిరాత‌కంగా హ‌త్య చేశారు.

అత‌ని హ‌త్య‌కు ముందు జూన్ 21న మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేశ్ ప్ర‌హ్లాద‌రావు కోల్హే అనే 54 ఏళ్ల ఫార్మసిస్టు హత్య జరిగింది. అత‌నిని క‌త్తితో పొడిచి హ‌త్య చేశారు. ఈ హ‌త్య కూడా నుపుర్ శ‌ర్మ వ్యాఖ్య‌ల‌కు సోష‌ల్ మీడియాలో పోస్టు ద్వారా మ‌ద్ద‌తు ప‌లికాడ‌న్న కార‌ణంగానే జ‌రిగింద‌న్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌కు వ్య‌తిరేకంగా నుపుర్ శ‌ర్మ వ్యాఖ్యలు చేశారంటూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా దుమారం రేగింది. దీంతో ఆమెను భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికార ప‌ద‌వి నుంచి తొలిగించింది.

ఈ ఘ‌ట‌న‌పై కేంద్ర హోం శాఖ ఎన్ఐఏ ద‌ర్యాప్తున‌కు ఆదేశించింది. ఈ కేసును ఇక‌పై ఎన్ఐఏ విచారిస్తుంద‌ని హోం మంత్రిత్వ‌ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ హ‌త్య‌తో ఏమైనా సంస్థ‌ల‌కు సంబంధాలు ఉన్నాయా.. అంత‌ర్జాతీయ లింకులు ఉన్నాయా.. అనే కోణంలో ఎన్ఐఏ నిశితంగా ద‌ర్యాప్తు చేస్తుంద‌ని పేర్కొంది.

కాగా, అమరావతిలో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ముదస్సిర్ అహ్మద్, షారుఖ్ పఠాన్, అబ్దుల్ తౌఫీక్, షోయబ్ ఖాన్, ఆతిబ్ రషీద్, యూసుఫ్ ఖాన్ బహదూర్ గా గుర్తించారు. కాగా, మరో అనుమానితుడు షామిన్ అహ్మద్ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. క‌న్హ‌య్య‌లాల్ హ‌త్య‌కు వారం రోజుల ముందే ఉమేశ్ హ‌త్య జ‌రిగింది.

First Published:  2 July 2022 9:42 PM GMT
Next Story