Telugu Global
NEWS

నీళ్లు, నిధులు, నియామ‌కాలు లేవ్‌ – అమిత్ షా

నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో.. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు కూడా లేవంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. విజ‌య సంక‌ల్ప స‌భ‌లో మాట్లాడిన‌ ఆయన.. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆయన తెలుగు పదాలు మాట్లాడి అందర్నీ ఉత్తేజపరిచారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా.. అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. దేశం పురోగమిస్తుంటే.. తెలంగాణ తిరోగమనంలో ఉందన్నారు అమిత్ షా. కాంగ్రెస్ చేసిన తప్పు.. గతంలో […]

నీళ్లు, నిధులు, నియామ‌కాలు లేవ్‌ – అమిత్ షా
X

నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో.. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు కూడా లేవంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. విజ‌య సంక‌ల్ప స‌భ‌లో మాట్లాడిన‌ ఆయన.. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆయన తెలుగు పదాలు మాట్లాడి అందర్నీ ఉత్తేజపరిచారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా.. అభివృద్ధి శూన్యం అని విమర్శించారు. దేశం పురోగమిస్తుంటే.. తెలంగాణ తిరోగమనంలో ఉందన్నారు అమిత్ షా.

కాంగ్రెస్ చేసిన తప్పు..
గతంలో బీజేపీ హయాంలో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కానీ అక్కడ ఇలాంటి ఇబ్బందులు లేవని, కానీ కాంగ్రెస్ చేసిన విభజన వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు అమిత్ షా. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు బీజేపీ సమాధానం చెబుతుందని, వచ్చే దఫా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేటీఆర్ పై ప్రేమ..
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరికీ ఉద్యోగాలు రాలేదని, కేవలం కేసీఆర్ తన కొడుకుకి మాత్రం మంత్రి పదవి ఇప్పించుకున్నారని విమర్శించారు అమిత్ షా. కేటీఆర్‌ ను ఎలా సీఎం చేయాలనేదే కేసీఆర్‌ ఆలోచన అని అన్నారు. రాత్రి, పగలు కేసీఆర్ ఇదే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. అయితే ఆయన కలలు ఫలించవని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్.. ఎవరూ ముఖ్యమంత్రులు కాలేరని, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఒక్కసారైనా సచివాలయానికి వెళ్లారా అని ప్రశ్నించారు..? ఆయనకు సచివాలయానికి వెళ్లే అవసరం ఎప్పటికీ రాదని, వచ్చేసారి బీజేపీ ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తారని చెప్పారు.

ఒవైసీ అంటే భయం..
తెలంగాణ సర్కారు అనే వాహనం కేసీఆర్ దే అయినా.. దాని స్టీరింగ్ మాత్రం అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో ఉందని అన్నారు అమిత్ షా. అసదుద్దీన్ అంటే కేసీఆర్ కి భయం అని.. అందుకే హైదరాబాద్ విమోచన దినాన్ని కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. కచ్చితంగా హైదరాబాద్ విమోచన దినాన్ని నిర్వహిస్తామన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే.. భారత దేశ పటంలో హైదరాబాద్ ఉండేది కాదన్నారు అమిత్ షా.

First Published:  3 July 2022 1:47 PM IST
Next Story